నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
నిజమైన నిరుద్యోగులకు యూనివర్సిటీ భర్తీ చేసే పోస్టులలో అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో పూలాంగ్ చౌరస్తాలో శనివారం వీసీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఇందూర్ విభాగ్ కన్వీనర్ మనోజ్ కుమార్, రాష్ట్ర కార్య సమితి సభ్యులు నవీన్ కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీ పాలక మండలిలో చర్చించకుండా, ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా అక్రమ పద్దతిలో, ముడుపులు తీసుకొని దాదాపు 46 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేసారని అన్నారు. దిన పత్రికలలో వార్తలు వస్తున్నాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ప్రజా ప్రతినిధులు, పాలక మండలి సభ్యులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఎవరికి పోస్టులు ఇచ్చారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ పరువు తిస్తె ఊరుకునే పరిస్థితి లేదని... నిజమైన నిరుద్యోగులకు యూనివర్సిటీ భర్తీ చేసే పోస్టులలో అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా అక్రమ నియామకాలు చేపడితే రద్దు అయ్యయని , అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించే ఉద్యోగుల పట్ల మార్గదర్శకాలు ఉన్నాయని , మరి ఆ మార్గదర్శకాల ప్రకారం యూనివర్సిటీ పరిపాలనా అధికారులు ఖాళీలు నింపుతారా లేదా మీ ఇష్టారీతిన నింపుకుంటారా అని ప్రశ్నించారు. వివరాలను బయటకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ నియామకాలు కాకుండా ఇంకా చాలా విషయాలు యూనివర్సిటీలో చర్చోప చర్చలు జరుగుతున్నాయని, అదేవిధంగా యూనివర్సిటీ నిధులు ఖర్చు పెట్టే వాటికి ఒక పద్ధతి లేకుండా వ్యవహారం జరుగుతున్నట్టు యూనివర్సిటీలో ప్రచారంలో ఉన్నాయని వీటిని పైన, నిధుల దుర్వినియోగం, అక్రమ నియామకాలపై, అక్రమ ప్రమోషన్ల పై ఈ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న యూనివర్సిటీ పరువు కాపాడాలని, అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి వెంటనే స్పందించి విసి, రిజిస్ట్రార్ లపై చర్యలు తీసుకోవాలని లేనిచో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ చర్యలు మానుకొని నియమకల గురించి బహిరంగ పరచాని పక్షంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు వీసీ, రిజిస్ట్రార్ లే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, ప్రవీణ్, ఆదిత్య, శివకుమార్ తదితరులు పాల్గోన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:24PM