నవతెలంగాణ కంటేశ్వర్
నగరంలోని స్థానిక మారుతీ నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో శనివారం పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి యన్ వి దుర్గాప్రసాద్ హాజరయ్యారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సాధారణ పాఠశాల విద్యార్థులను కూడా భాగస్వాములను చేయడం వారికి వివిధ అంశాలలో పోటీలు నిర్వహించి పండిత దీన్దయాల్ పై అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. దివ్యాంగ బాలలు కూడా సాధారణ విద్యార్థులతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వారిలో ఉన్న సామర్థ్యానికి నిదర్శనం అన్నారు. నిజామాబాద్ జిల్లా లో పాఠశాలల విద్యార్థులు యథాస్థితికి వచ్చి కరోనా నుంచి బయటపడి చదువుపై శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారుమా. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకొని విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా కాపాడుతున్నారని వివరించారు. నిజామాబాద్ జిల్లాలో ఏ పాఠశాలల్లో ఇప్పటికైతే కోవి డ్ కేసులు నమోదు కావడం లేదని అన్నారు. కోవిడ్ నివారణలో మీడియా సహకారం మరువలేనిదని తెలిపారు. బ్రెయిన్ లిపిలో విద్యను అభ్యసించడానికి స్నేహ సొసైటీ కి రిఫర్ చేస్తామని తెలిపారు. దివ్యాంగుల కు సంబంధించి ఏ సహాయం అవసరమున్నా జిల్లా విద్యాశాఖ ముందుకు వచ్చే వారికి సహకారం అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల పాఠశాల విద్యార్థుల నార్మల్ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా స్నేహ సొసైటీ నార్మల్ పాఠశాల అయినా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లు బోర్ గా మ్ దుబ్బ చంద్రశేఖర్ కాలనీ పోలీసు లైన్ ఉన్నత పాఠశాల మాడ్రన్ హైస్కూల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు చిత్రలేఖనం పోటీలు, పాటల పోటీ నిర్వహించడం జరిగింది. పోటీలలో ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య, ప్రిన్సిపల్ ఎస్. జ్యోతి, వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ సీఎంఆర్ ఇన్ చార్జి తాటి వీరేశం, దుబ్బ చంద్రశేఖర్ కాలనీ ప్రధానోపాధ్యాయులు గంగయ్య కే శ్రీనివాస్ స్నేహ సొసైటీ వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, వివిధ పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు దివ్యాంగ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:49PM