జీవనోపాధికి చేయూత
నవతెలంగాణ - అశ్వారావుపేట
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వాసవి క్లబ్ - అశ్వారావుపేట ఆర్ధిక సహాకారం తో డాన్ టు డస్క్ ( DAWN To DUSK) లో భాగంగా నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో వాసవి క్లబ్ అద్యక్షులు శీమకుర్తి సుబ్బారావు నేతృత్వంలో శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా వి.ఎన్ సిల్వర్ స్టార్ కె.సి.జి.ఎఫ్ పత్తి విశ్వనాథ్ కుమార్ హాజరు అయ్యారు. ముందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సందర్శించి వాసవి దైవాన్ని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు అందజేసిన తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దివ్యాంగురాలు దుర్గ జీవనోపాధికి ఇనుప బడ్డీ అందజేసి ప్రారంబించారు.విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేసారు.మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీఐ బొమ్మెర బాలకృష్ణ,కొత్తూరు రాజేశ్వరరావు,పసుమర్తి వెంకటేశ్వరరావు,భోగవల్లి రాంబాబు,ఆలయ కమిటీ చైర్మన్ ముత్తా సుమాకరు,దార పుల్లారావు,దోపుకుంట్ల వెంకటేశ్వరరావు, రావిక్రింది కుమార్ రాజా,శివ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 08:21PM