Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనిల్‌కుమార్‌
  • వామన్‌రావు దంపతుల హత్యతో ప్రమేయం ఉన్న వారికి శిక్ష పడేలా చేస్తాం
  • ఆన్‌లైన్‌ పరీక్ష ఉందంటూ గదిలోకి వెళ్లి ఉరేసుకున్న విద్యార్థిని
  • లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం.. జవాన్ మృతి
  • యువ‌తిపై ప్రేమోన్మాది దాడి..పరిస్థితి విషమం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కరోనా కంటే... భయంకర వైరస్‌లున్నాయి జాగ్రత్త!! | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

కరోనా కంటే... భయంకర వైరస్‌లున్నాయి జాగ్రత్త!!

Sat 18 Jul 19:59:47.422401 2020

ప్రకృతి, జీవావరణం అసమతుల్యతలో పడి నేల చల్లని ఒడిని కోల్పోయింది. అమ్మనే అమ్ముకునే మానవ నాగరికతలో కన్నెర్రజేస్తున్న జనని. ప్రకృతి విధ్వంస ఫలితమే ఈ భయంకర మానవ హననం. భూమిని కూడా సరుకును జేసి, వ్యాపారపు లాభాల ఊబీలోకి సమాజాలను తోసి చోద్యం చూస్తున్న నేరస్తుల ఫలం ఇది. ఏ దేశమైనా ప్రదేశమైనా మానవుడు ఈ భూమిపైన నీతోటి వాడు. నేరాలను స్థలాలకు పూయొద్దు. ఘోరాలకు రంగులేయొద్దు. అసలు కారణాలనొదిలి నెపాలతో చేతులు దులపొద్దు. ఎన్ని విపత్తులొచ్చినా మనిషి తన ప్రవర్తనను మార్చుకోలేడు. తన ఆలోచనలనే అన్నిటిపై పరుస్తున్నాడు. కుట్రలు పన్నాడు. యుద్ధాలు చేశాడు. దేశాలనాక్రమించాడు. అణు బాంబులు సృష్టించాడు. కోట్లాది మంది ప్రాణాలను బలిపెట్టాడు. ఇంకా ఇంకా... ఈ విధ్వంసక ఆలోచన సాగుతూనే వుంది. ఈ పయనం మారకపోతే ప్రకృతే తిరగబడుతుంది. అదే ఈ రోజు రుజువు చేస్తోంది. ప్రముఖ వైద్యులు, కవి, రచయిత, సామాజిక విశ్లేషకులు డా|| విరించి విరివింటి గారు దీనిపై ఏమంటున్నారో చదవండి.
కొంతకాలం కిందటి వరకు ''వైరస్‌'' అంటే కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ని పాడు చేసి లోపలున్న డాటా మొత్తాన్ని పోగొట్టేది అనే అనుకునే వాళ్ళం. ఏదైనా వీడియో లేదా వార్త సోషల్‌ మీడియాలో ''వైరల్‌ అవ డం'' తెలిసి నంతగా ''వైరల్‌ ఫీవర్‌'' గురించి తెలిసేదీ కాదు. ఇపుడి పుడే ''వైరస్‌'' అంటే ఒక రోగకారక అతి సూక్ష్మ నిర్మాణ మని వైద్య శాస్త్రంతో సంబంధం లేని జనబాహుళ్యానికి కూడా అర్థమవడం మొదలైంది.
ఆత్మలకూ దయ్యాలకూ ఇతరు లను చంపే శక్తి స్వతహాగా ఉండదనీ, అందుకే ఎవరినైనా పగబట్టి చంపాలంటే అవి ఇతరుల శరీరాల్లోకి దూరి చంపుతూ ఉంటాయనీ మనకు సినిమాల్లో చూపుతూ ఉంటారు. సరిగ్గా అలాగే వైరస్‌లూ స్వతహాగా నిర్జీవమైనవి, శక్తి హీనమైనవి. ఐతే ఏదైనా జంతువు లేదా మనిషి కణంలోకి చేరితే దానికి ప్రాణం వస్తుంది. ప్రాణం ఉండే ప్రతీ జీవీ చేసే మొదటి పని తనను తాను పునరుత్పత్తి చేసుకోవడమే. వైరస్‌ శరీర కణంలో చేసే పని అదే. శరీరంలో వందలు వేలై, పది వేలై అది తన సంఖ్యను పెంచుకో గలుగుతుంది.
నిర్జీవమైన ఒక వస్తువు జీవకణంలోకి చేరగానే ఎలా ఒకటికి వేయింతలవుతుంది? అదెలా సాధ్యం? అంటే దాని నిర్జీవ నిర్మాణంలోనే పునర్జీవింపగలిగే అవకాశం పొందు పరచబడి ఉంటుంది. దానినే ''జీనోమ్‌'' అంటాం. వైరస్‌ ఒక లిపో ప్రోటీన్‌ కవచాన్ని కలిగి దానిలోపల ఒక జీనోమ్‌ని కలిగి ఉంటుంది. జీనోమ్‌లో జన్యువులుంటాయి. అంటే జీవనం జన్యువులుంటే తప్ప సాధ్యం కాదు. ఆ జన్యువులకు అనుకూల వాతావరణం ఉంటే తప్ప పునరుత్పత్తి సాధ్యం కాదు అనే ప్రాథమిక అవగాహన మనకు వైరస్‌ల జీవన విధానాన్ని గమనిస్తే తెలుస్తుంది. ఇది సష్టి మూలాలను, సష్టి ధర్మాలనూ తెలుపే ఓ అంశం.
ఐతే వైరస్‌ స్వతహాగా హాని చేసేది (దెయ్యం) కాదు. అది తన బతుకు పోరాటంలో ఒక జీవిని ఆశ్రయించి వద్ధి చెందుతుంది తప్ప స్వతహాగా దానిలో ఒక జీవిని చంపగలిగినంత శక్తి ఉండదు. అసలు దానికంటూ ఏ ఆలోచనా ఉండదు. మరి అలాంటప్పుడు వైరస్‌ ఇన్ఫెక్షన్‌ అంటే ఏమిటి? ఓ మనిషి కణాన్నో జంతువు కణాన్నో వెతుక్కుంటూ వచ్చి తన మానాన తను వద్ధిచెందే పనిలో పడుతుంది వైరస్‌. ఈ క్రమంలో అది ఆ మనిషి లేదా జంతువు రక్తంలోకి చేరడం, శరీరమంతా పాకడంతో శరీరం ఏదో శత్రువు వచ్చేసిందని దానిపై యుద్ధం చేయడానికి సిద్ధపడటం జరుగుతుంది. వైరస్‌ ను చంపాలని శరీరం చేసే ప్రయత్నంలో సైనికులవంటివీ, వార్తాహరులవంటివీ ఐన ఎన్నో రక్త కణాలూ, కెమికల్సూ అన్నీ శరీరంలో తయారై ఒక యుద్ధ వాతావరణం నెలకొంటుంది. దీనినే ''ఇన్ఫ్లామేషన్‌'' అంటాం. ఈ ఇన్ఫ్లామేషన్‌ ఏర్పడిందని చెప్పడానికే మనకు జ్వరము, దగ్గు వంటి లక్షణాలు వస్తాయి. వైరస్‌ని నాశనం చేసే క్రమంలో ఈ ఇన్ఫ్లామేషన్‌ తన స్వంత శరీర కణాలనూ రక్త కణాలను కూడా నాశనం చేయవచ్చు. ఈ మొత్తాన్నీ వ్యాధి అంటున్నాం. రోజులు గడిచేకొద్దీ వ్యాధి తీవ్రతరమౌతుంది. తీవ్రమయ్యే కొద్దీ అవయవాలు దెబ్బతినడం మొదలౌతాయి. పూర్తిగా అవయవాలు దెబ్బతినేసరికి మరణం తప్పనిదౌతుంది. ఎంత ఎక్కువగా వైరస్‌ శరీరాన్ని తట్టుకుని నిలబడగలుగుతుందో అనే దాన్ని బట్టి దాని ''ఙఱతీబశ్రీవఅషవ'' ని నిర్ణయించవచ్చు. ఎక్కువ విరులెన్స్‌ గల వైరస్‌ల వలన అందుకే మరణం కూడా సంభవించవచ్చు.
అందుకే శరీరం లోపలికి వచ్చిన వైరస్‌పై శరీరం చేసే యుద్ధం సరైనరీతిలో జరగాలంటే మందులు అవసరం అవుతాయి. వైరస్‌ తన జీవితాన్ని వెతికే క్రమంలో ఒక మనిషిని చేరితే ఆ మనిషి నుంచి మరొక మనిషికి పాకి అక్కడ కూడా వద్ధి చెందాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. శరీరం విడుదల చేసే పదార్థాలను తుమ్ము కావచ్చు, దగ్గు కావచ్చు, లాలాజలం కావచ్చు, మలమూత్రాదులు కావచ్చు. ఒక్కోసారి రక్తమూ, వీర్యమూ కావచ్చు. వీటి ద్వారా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కొన్ని వైరస్‌లకు ఈ వద్ధి కాంక్ష ఎక్కువ. దీనినే ''ఇన్ఫెక్టివిటీ'' అంటున్నాం. ఇది ఎక్కువగా ఉన్న వైరస్‌లు కొద్ది రోజుల్లోనే ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి. దీనినే ఎపిడెమిక్‌ అంటుంటాం. గ్లోబలైజేషన్‌ జరిగి ప్రపంచం చిన్నదైపోతున్న తరుణంలో ఎపిడెమిక్‌ స్థానంలో పాండమిక్‌ వచ్చి చేరుతుంది. అంటే ఒక దేశంలో ఒక వ్యక్తికి వైరస్‌ సోకితే ప్రపంచంలోని అన్ని దేశాలకూ వ్యాపించ గలగటం అన్నది వైరస్‌కు ఉన్న వద్ధి కాంక్ష కంటే ప్రపంచ దేశాలకున్న వ్యాపార వద్ధి కాంక్ష అని చెప్పవచ్చు. అందుకే రాబోయే కాలంలో ఎపిడెమిక్‌లు ఉండవు. అన్నీ పాండమిక్‌లే.
ఐతే కరోనా వంటి ఇన్ఫెక్టివిటీ గల వైరస్‌ ప్రపంచమంతా వ్యాపిం చాక తెలిసొచ్చిన అంశం ఏమిటంటే కరోనాకంటే భయంకరమైన వైరస్‌లు ఎప్పటినుంచో మన సమాజాల్లో తిష్ట వేసుకుని ఉన్నాయని, అవి మనుషు లను అటాక్‌ చేయడానికి వాళ్ళను నాశనం చేయడానికి అవకాశం కోసం మాత్రమే కాచుకుని కూచున్నాయని. వాటి పేర్లు ''సూడో సైన్సు, కాన్స్పిరసీ థియరీ, పుకార్లు, రేసిజం, కమర్షియలిజం, సామ్రాజ్య వాదం. ఒక పాండెమిక్‌ని ఆధారంగా చేసుకుని మనుషులలో, మానవ సమాజంలో ఉండే లేకితనపు అసహ్యతనంతా బట్టబయలు చేసేంతగా ఇవి ఉపరితలం మీదకి వచ్చి విజంభిస్తున్నాయి. వీటి ఇన్ఫెక్టివిటీ ముందు కరోనా వైరస్‌ కూడా దిగదుడుపే. ఈ వైరస్‌లు కరోనా వైరస్‌ వలె సోషలిస్టులు కావు కానీ చదువుకున్న వారు కూడా వీటి బారిన పడుతుండటంతో యుక్తాయుక్త విచక్షణను నశింప జేయడంలో ఈ వైరస్లు కూడా సోషలిస్టులేనని చెప్పక తప్పదు. ముఖ్యంగా ప్రపంచ మంతా పాకిన కరోనా పాండె మిక్‌ని ఎదుర్కోవాలంటే ప్రపంచ మంతా ఏకమవాల్సింది పోయి, దేశాలుగా, జాతులుగా విడిపోయి యుద్ధాలు చేసు కునే పరిస్థితికి దిగజార్చిన వైరస్‌లు ఇవే. సైన్సు ఫిక్షన్‌ సినిమాల్లో ప్రపంచానికి గ్రహ శకలం రూపంలోనో, వైరస్‌ రూపంలోనో ఒక విపత్తు వస్తుంటుంది. అపుడు ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఆ విపత్తును ఎదుర్కొంటాయని ఆ డైరెక్టర్‌లు పాపం అమాయకంగా సినిమా ఊహలు చేస్తుంటారు. కానీ నిజానికి ప్రపంచానికి ఒక ముప్పు వచ్చినపుడు ప్రపంచ దేశాలు ఏకమౌతాయని ఊహిం చడం కేవలం భ్రమ మాత్రమేనని వర్తమాన ప్రపంచ చరిత్ర చెబుతోంది. మనుషులుగా జాతులుగా మతాలుగా దేశాలుగా విడిపోవడం మరింత ప్రస్పుటంగా కనిపిస్తూ ఉంది. వైద్యానికి సంబంధించినంత వరకు ప్రపంచమంతా ఏకతాటిపై నడవాలని కోరుకునే ఔనఉ వంటి సంస్థలకు కూడా రాజకీయ మకిలి అంటించి నిర్వీర్యం చేసే కుయుక్తులు మొదలైనాయి. వీటన్నింటి దష్ట్యా కరోనా వైరస్‌కి భయపడి మాత్రమే మనం క్వారంటైన్‌ చేయడం సరి కాదనిపిస్తుంది. మనం క్వారంటైన్‌లో ఉంచ వలసిన అంశాలు మరెన్నో ఉన్నాయి. ప్రజలను పెద్ద సంఖ్యలో చంపేటు వంటి పాండమిక్‌లను కూడా అగ్ర దేశాలు తమ ఎకనామికల్‌ సూప్ర మసీకి వాడుకోవడం చూస్తుంటే ఎకనామికల్‌ ప్రపంచ ఏకీకరణ దుస్సాధ్యమనే విషయమూ బోధపడుతున్నది.
కరోనా వైరస్‌ కానీ మరే వైరస్‌ ఐనా గానీ తన జన్యు నిర్మాణాన్ని మార్చుకుంటూ ఉంటుంది. కాలం గడిచేకొద్దీ వాటి ఇన్ఫెక్టివిటీ, తీవ్రతలు తగ్గే అవకాశమూ ఉంది. కానీ మనిషి మెదడును తొలుస్తున్న భయంకరమైన వైరస్‌లు ప్రపంచాన్ని మరింత భ్రష్టు పట్టించేందుకు సన్నద్ధ మౌతున్నట్టే కనబడు తోంది. ఒకవైపు వైరస్‌ చుట్టూ బయో ఇన్ఫర్మేషన్‌ పెరుగు తుండగా మరో వైపు ఈ పాండెమిక్‌ ఆధారంగా అబద్ధాలనూ అసత్య ప్రచారాలను తమకనుగుణంగా వాడుకుని పబ్బం గడిపే ''బయో పాలిటిక్స్‌'' మొదలయ్యాయి. కాబట్టి కరోనా వైరస్‌ పాండమిక్‌ ముగిశాక కూడా మానవ మస్తి ష్కంలో కొత్తగా పుట్టిన వైరస్‌లు ఇపుడిపుడే మనల్ని వీడి పోయేలా లేవు. కరోనా వైరస్‌ల వలె కాకుండా కాలం గడిచే కొద్దీ ఇవి మరింత ఇన్ఫెక్టి విటీని విరు లెన్సునూ పెంచు కుని ప్రపంచ వినాశనానికి దారి తీస్తాయేమో అనిపిస్తోంది. కొన్ని నెలల కరోనా శకం కంటే పోస్ట్‌ కరోనా శకం భయం కరంగా ఉండబో తోందేమో.
కరోనా వైరస్‌ ల్యాబ్‌లో తయారయిందా?
కరోనా వైరస్‌ ల్యాబ్‌ లో తయారయిందా అనే విషయాన్ని రాజకీయ నాయకులో లేక జర్నలిస్టులో లేక డాక్టర్లో నిర్ణయించాల్సిన విషయం కాదు. జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ ద్వారా మాత్రమే ఒక వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేయగలం. కాబట్టి జెనెటిక్స్‌లో నిష్ణాతులైన శాస్త్రవేత్తలు మాత్రమే దీనిని నిర్ణయించడానికి అర్హులు. పుకార్లు, కాన్స్పిరసీ థియరీలను పక్కన పెడితే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల శాస్త్రవేత్తలు ఇది ల్యాబ్‌లో తయారైన వైరస్‌ కాదనీ సహజంగానే ఉద్భవించిందనీ ఆధారలతో సహా చెబుతున్నారు. ఐతే శాస్త్రవేత్తలలో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దేనినైనా సైన్సు కుండ బద్దలు చేయకతప్పదు. దానికోసం మనం వేచి ఉండక తప్పదు. ఇది సైన్సు కోణం.
ఐతే చైనా కనుక దీనిని ల్యాబ్‌లో తయారు చేసి బయో వార్‌ లాగా ఉపయోగించాలి అని అనుకుని ఉండింటే... ఒక చిన్న బాటిల్‌లో పట్టే వైరస్‌ శాంపుల్‌ని తన శత్రుదేశంలో వదిలి వేస్తుందే తప్ప, తన సొంత దేశంలో వదిలి వేల మంది మరణాలకు కారణం అయ్యి ఆర్థికంగా బలహీన పడాలి అనుకోదు. అంతేకాకుండా మనకు బయోవార్‌ జరగకుండా అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. చైనాతో పాటు మరెన్నో దేశాలు ఆ ఒప్పందంపైన సంతకాలు చేశాయి. ఏకైక ఆర్థిక శక్తిగా ఎదగాలని ప్రత్నిస్తున్న చైనా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి బయోవార్‌ చేసి, ఆ తర్వాత ప్రపంచంలో ఏకాకిగా మిగలాలని అనుకోదు. ఆర్థిక శక్తిగా ఎదగా లంటే వ్యాపారా త్మకత సఖ్యత అన్ని దేశాలకూ విస్తరించాలి తప్ప తెగ తెంపులు చేసుకోకూడదు. కాబట్టి బయోవార్‌ చేసేంత పిచ్చి పని ప్రస్తుత పోటీ తరుణంలో చేయక పోవచ్చు. ఇది రాజకీయ కోణం.
ఐతే ఏదైనా ల్యాబ్‌ నుంచి మానవ తప్పిదం వలన వైరస్‌ లు బయటపడే ప్రమాదం ఉంది. వూహన్‌ లో ఉన్న ల్యాబ్‌ పకడ్బందీ రక్షణ వ్యవస్థ గల లెవెల్‌ 4 (BSL 4) ల్యాబ్‌. ఇలాంటి వ్యవస్థ గల ల్యాబ్‌ నుంచి వైరస్‌ బయటపడటం అసాధ్యం. ఈ వాదనకూ ఋజువులు అవసరం. జెనెటికల్‌ ఇంజనీర్డ్‌ వైరస్సే కాదని మనకు ఋజువులున్నపుడు వైరస్‌ ల్యాబ్‌ నుంచి మానవ తప్పిదం వలన బయటపడిందనడంలో అర్థమే లేదు. కాబట్టి ఏరకంగా చూసినా ఇది సహజంగా పరిణామం చెందిన వైరస్‌ అనిపిస్తుంది ప్రస్తుతానికి. బయోవార్‌ కాకూడదనే కోరుకుందాం. ఇది నిజంగా బయోవారే ఐనట్టయితే సులువుగా వైరస్‌ను ల్యాబ్‌ లో సష్టించడం నిజమే ఐతే ప్రతీ దేశము బయోవార్‌ మొదలు పెడితే ప్రస్తుత యుద్ధవాతావరణం దష్ట్యా మానవాళి భూమి మీద మరెంతో కాలం ఉండబోదని చెప్పవచ్చు.
కరోనా సహజంగానే పరిణామం చెందుతూ తీవ్రతను తగ్గించుకుంటూ రావడం శుభపరిణామం. ప్రపంచం గతంలో ఇలాంటి ఎన్నో జబ్బులను ఇంతకంటే భయంకరమైన జబ్బులనూ చూసింది. అన్నింటినీ ఎదుర్కొంటూ మానవాళి పురోగమిస్తుంది. కరోనానూ మనం అధిగమిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పట్టడం ఇపుడిపుడే మొదలైంది. రికవరీ కేసులు పెరిగాయి. క్రిటికల్‌ కండీషన్‌ లో ఉన్న పేషంట్లు ప్రస్తుతం ఒకశాతం కంటే తక్కువగా ఉన్నారు. డాక్టర్లకు సైతం కరోనా అర్థమవడం మొదలైంది. ఇలా ఎన్నో శుభవార్తతలు వినవస్తున్నాయి. అందుకే సైంటిఫిక్‌ దక్పథాన్ని వీడకుండా జాగ్రత్తగా ఉన్నవాళ్ళందరూ సురక్షితంగానే ఉంటారు. అజాగ్రత్త, అన్‌ సైంటిఫిక్‌ థింకింగ్‌, కాన్స్పిరసీ థియరీలూ పుకార్లు కలిగించే అనవసర భయాలూ వీడితే తప్పకుండా కరోనాను జయించగలం. చేతులు కడుక్కోవడం మాస్కులు ధరించడం ఫిజికల్‌ డిస్టాన్సును పాటించడం ఇవి మూడు మత్యుంజయ మంత్రాలు. ఇవి చక్కగా సైంటిఫిక్‌ అవగాహనతో పాటించినవారికి తిరుగులేదు. ఎప్పుడైనా మంచి పౌష్టికాహారం, సుఖమైన నిద్ర, గతి తప్పని శారీరక వ్యాయామం.మంచి స్నేహపూరితమైన ప్రేమమయ జీవనం ఇవి మనిషికి అన్ని రోగాలనుంచి బయటపడగల శక్తిని ప్రసాదిస్తాయి. ఈ కరోనా సమయంలోనైనా వీటి ప్రాధాన్యత గుర్తెరిగి నడుచుకుంటే కరోనానే కాదు ముందు ముందు రాబోయే అనేక రోగాలనూ దూరం పెట్టగల సామర్థ్యం పెరుగుతుంది.

(virinchi virivinti : youtube channel)
- డా|| విరించి విరివింటి,
ఎంబిబిఎస్‌, పీజీ
క్లినికల్‌ కార్డియాక్‌ ఫిజీషియన్‌
9948616191

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సైన్సుదే భవిష్యత్తు!
సృజనకు విత్తు స్వంత భాష
పేమ్ర పేమ్రను పేమ్రిస్తుంది..
ఆదివాసీ దర్పం నాగోబా జాతర
హొయలొలికిన భారతీయ చితక్రళ
పాత పంటల సంరక్షణే లక్ష్యంగా...
ఆ మూడు చట్టాలలో అస‌లేముంది?
సినీ సంగీత సామ్రాజ్యంలో గాన గంధర్వుడు యేసుదాస్‌
క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే
2020లో ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా !

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
10:01 PM

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనిల్‌కుమార్‌

09:49 PM

వామన్‌రావు దంపతుల హత్యతో ప్రమేయం ఉన్న వారికి శిక్ష పడేలా చేస్తాం

09:22 PM

ఆన్‌లైన్‌ పరీక్ష ఉందంటూ గదిలోకి వెళ్లి ఉరేసుకున్న విద్యార్థిని

09:04 PM

లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం.. జవాన్ మృతి

08:43 PM

యువ‌తిపై ప్రేమోన్మాది దాడి..పరిస్థితి విషమం

08:18 PM

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్‌

07:58 PM

సౌదీ అరేబియాలో విషాదం..భారతీయ నర్సులు దుర్మరణం

07:50 PM

బుల్లెట్ సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో తొక్కించిన పోలీసులు

06:50 PM

పునరావాసం కల్పించాలి

06:48 PM

ఘనంగా రేణుక దేవి కళ్యాణ మహోత్సవం

06:47 PM

హైదరాబాద్ లో దారుణమైన ఘటన..

06:37 PM

మందు బాబులకు కొత్త సమస్య..

06:24 PM

ఏపీలో 106 కరోనా కేసులు నమోదు

06:18 PM

ఖమ్మం జిల్లాలో జేసీబీలు..ట్రాక్టర్లు పీఎస్‌కు తరలింపు

05:58 PM

మహిళా వాలంటీర్ పై ఎమ్మెల్యే బూతు పూరాణం..ఆడియో వైరల్

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.