మిత్రులారా, మనందరికీ తెలుసు, ఆగష్టు 19 అంత ర్జాతీయ ఛాయా చిత్ర దినోత్సవం (International Photo graphy Day). 1939, ఆగష్టు 19న లూయిస్ డగ్గురే (Louis Daguerre) అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త కనుగొన్న డగ్గురే విధానం అనే ప్రక్రియను ఫోటోగ్రఫీ ప్రక్రియగా ఫ్రెంచ్ శాస్త్రీయ సంస్థ గుర్తిం పునిస్తూ ఫోటోగ్రఫీకి నాంది పలికిన సందర్భంగా ఈ రోజును ఫోటోగ్రఫీడే గా జరుపుకుంటున్నాం. అంటే ఏం చేయాలి? అందరూ ఆ రోజు కామెరాలకు పూజలు చేయాలా?! లేదా కెమెరాలు పట్టుకొని అందరూ ఎవరికి తోచిన, దొరికిన పిచ్చివో మంచివో ఫోటోలు హడావిడిగా తీసి, సామాజిక మాధ్యమాల్ని ముంచెత్తాలా?! అంటే కాదు. కానే కాదు. మరేం చేయాలి?!
నేటి మానవ జీవితంతో, ఫోటో ఎలా విడదీయలేని ఒక బలీయమైన బంధాన్ని ఏర్పరచుకొందో గుర్తించడమే కాకుండా, ఆ బలమైన మాధ్యమాన్ని మరింత గొప్పగా మానవజీవిత విశ్లేషణకి, అందులోని అంద మైన, మధురమైన దశ్యాలనే కాక, విషాదం, అమానుషం, అద్భుతం... ఇలా ప్రతి ముఖ్యమైన సంఘటనల కాలాల్ని ఘనీభవింపజేసి, చిరస్థాయిగా మన ముందు తరాలకు అందించే సాధనంగా ఎలా ఉపయోగిం చాలో తెలుసుకోవడం. ఈ ప్రయాణంలో ఫోటోగ్రఫీ ఎలా రోజు రోజుకూ టెక్నికల్‌గానే కాక కళాత్మకంగా ఎదుగుతోందో గుర్తించడం. అది ఎలా అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తోందో పరిశీలిం చడం. దాన్ని మరింత పదునుగా, శక్తివంతంగా ఉపయోగించడం. ఇదే ఈ రోజు ప్రాముఖ్యత.
అయితే, ఫోటోగ్రఫీ ఇంత విస్తత వికాశాన్ని నేను ఈ ఒక్క వ్యాస పరిధిలో వివరించలేను. నాకున్న పరిమిత అవగాహనని, పరిమిత అవకాశాన్ని దష్టిలో పెట్టుకొని, లోతుకు పోకుండా నాలుగు మాటలు ముచ్చటిస్తున్నాను.
ఫోటోగ్రఫీ అనేది ప్రధానంగా దశ్య మాధ్యమం. ఇది వెలుగు నీడలతో చేసే కళాత్మక విన్యాసం. కాబట్టి దీనికి కెమెరా అత్యంత కీలకం. క్రికెట్‌లో బ్యాట్ పట్టుకోకుండా పరుగులెలా చేయలేమో, ఇక్కడ కూడా కెమెరా లేకుండా ఏమీ చేయలేం. కానీ, కేవలం బ్యాట్ ఒక్కటే మన పరుగుల్ని ఎలా నిర్ణయించదో, ఇక్కడ కూడా ఎంత గొప్ప ఆధునిక కెమెరా నీ చేతిలో ఉన్నా, నీలో ఫోటో తీయడానికి కావాల్సిన కళాత్మకత, ప్రావీణ్యం లేకుంటే ఒక్కటి కూడా సరైన ఫోటో తీయలేవు. అవి ఏమిటో క్లుప్తంగా చూద్దాం.
మిత్రులారా, ఫోటోగ్రఫీలో composition and exposure అనేవి అత్యంత కీలకం. దాదాపు ఫోటో యొక్క ప్రాథమిక నాణ్యత ని ఈ రెండే శాసిస్తాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. Composition అంటే ఫోటోలో మనం దశ్యాన్ని బంధించి చూపే కోణం, నిడివి. ఉదాహరణకు ఓ సుందర ప్రదేశాన్ని ఫోటో తీస్తున్నప్పుడు, దాన్ని ఎక్కడి నుండి చూస్తే అందంగా ఉంటుందో తెలుసుకోవాలి. అందరూచూసే అతి సామాన్యమైన కోణంలో నుండి కాకుండా, ఓ కొత్త కోణంలో చూసినప్పుడు, ప్రదేశం అదే అయినా, దశ్యం మారిపోయి అందమైన ఫోటోగా మనకు నిలబడుతుంది. అది నువ్వు పడుకొని తీస్తావో, వొంగి తీస్తావో, రెండు చెట్ల మధ్యలో నుండి చూస్తూ తీస్తావో నీ ఇష్టం. అది నీ సజన మీద ఆధారపడి ఉంటుంది. అలాగే చూసే దశ్యాన్ని ఎంత నిడివిలో చూపాలో కూడా నీ సజనాత్మకత మీద ఆధారపడి ఉంటుంది. అంటే framing కూడా చాలా ముఖ్యం.
ఇక exposure గురించి ఫోటోగ్రఫీలో ఎంత చెప్పినా తక్కువే. Exposure లో ప్రధానంగా మూడు అంశాల మీద దష్టి పెట్టాలి. అవి, aperture,Shutter speed, ISO. అందుకే వీటిని exposure triangle అంటారు. కెమెరాను మన కంటితో పోల్చుకొంటే, aperture మన కనుపాప లాంటిది. ఇది లెన్స్‌కు ఉన్న తలుపు లేక కిటికీ లాంటిది. ఇందులో నుండే ఏ వస్తువునయితే మనం ఫోటో తీస్తున్నామో ఆ వస్తువు మీది నుండి పరావర్తనం చెందిన కాంతి కెమెరాలోకి ప్రవేశిస్తుంది. అంటే ఇది ఎక్కువుగా ఉంటే ఎక్కువ కాంతి, తక్కువుగా వుంటే తక్కువ కాంతి కెమెరాలోనికి ప్రవేశించి, అందులో ఉన్న ఫిల్మ్ లేదా ఇప్పటి డిజిటల్ కెమెరాల్లో ఉండే సెన్సర్ మీద పడుతుంది. దాన్నిసెన్సర్, ఎలెక్ట్రికల్ సిగల్స్‌గా మెమరీ కార్డ్‌లో నిక్షిప్తం చేస్తుంది. ఈ aperture ఎక్కువైనా, తక్కువైనా ఫోటో పాడవుతుంది. అంటే మనం ఫోటో తీసే సమయంలో ఎండ లేక వెలుతురు బాగా ఎక్కువుగా ఉంటే దీన్ని తగ్గించుకోవాలి. అలాగే వెలుతురు సరిగా లేకుంటే పెంచుకోవాలి. shutter speed పేరుకు తగ్గట్టుగా ఇందాక చెప్పిన లెన్స్ కిటికీ లేక తలుపు ఎంతసేపు తెరచి ఉంచాలి అనే దాన్ని తెలియజేస్తుంది. ఇది కూడా ఎక్కువైనా తక్కువైనా ఫోటో నాణ్యత పాడవుతుంది. ఇది aperture కి వ్యతిరేకంగా తీసుకోవాలి. అంటే, వెలుతురు ఎక్కువుగా ఉంటే స్పీడ్ ఎక్కువగా ఉండాలి. అంటే, తలుపు అలా తెరిచీ తెరవకనే మూసేయాలి. అలాగే వెలుతురు తక్కువుగా ఉంటే తలుపు ఎక్కువ సేపు తెరవాలి కాబట్టి, స్పీడ్ తక్కువ ఉండాలి. అంటే,Aperture, Shutter స్పీడ్ రెండూ కూడా లెన్స్‌కు సంబంధించినవే. ఇక ఐఎస్‌ఓ అనేది కెమెరాలోని సెన్సర్, తనపై పడుతున్న కాంతికి ఎంత సున్నితంగా స్పందించాలి అనే దాన్ని నిర్ణయిస్తుంది. ఇది కూడా aperture లాగా వెలుతురు తక్కువగా ఉంటే ఎక్కువగానూ, వెలుతురు ఎక్కువుగా ఉంటే తక్కువ గానూ తీసుకోవాలి. ఈ మూడూ exposure లో ప్రధానం. ఇవి కాకుండా మరికొన్ని అంశాల్ని కూడా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైనది కెమెరాను RAWలో ఉంచి ఘాట్ చేయడం. ఇది మరీ చిన్న కామెరాల్లో కాకుండా DSLR కెమెరాలలో ఏ లెవెల్ వాటిలోనైనా ఉంటుంది. ఇవన్నీ టెక్నికల్‌కి సంబంధించిన విషయాలు. ఇవన్నీ ఫోటో యొక్క రూపానికి సంబంధించినవే. అందులో జీవం కనపడాలంటే మాత్రం అది మన సజన మీదే ఆధారపడుతుంది. అంటే మనం తీసే వస్తువును బట్టి, ఏ కోణం లో తీస్తునాము, ఎలాంటి మూడ్ ని పట్టుకోగలిగాము, ఎలాంటి టైమింగ్‌లో దశ్యాన్ని బంధించాము. ఇలాంటివన్నీ మన సజనాత్మకత, అవగాహనల మీద ఆధారపడి ఉంటాయి. అందుకే ఫోటోగ్రఫీలో ఓ చక్కటి కొటేషన్ ఉంది- ''నువ్వు కెమెరా కొనగానే, ఆ కెమెరాకు యాజమానివి అవుతావే గానీ ఫొటోగ్రాఫర్ కాలేవు. అది కావాలంటే, నువ్వు మరెంతో చేయాలి'' అలాంటిదే మరో కొటేషన్ ''నువ్వు ఫోటోనే తీయాలంటే కేవలం ఒకే ఒక 'క్లిక్' దూరంలో ఉన్నావు. అదే ఓ మంచి ఫోటో తీయాలంటే నువ్వు ఓ వెయ్యి క్లిక్‌ల దూరంలో ఉన్నావు. ఓ గొప్ప ఫోటో తీయాలంటే మాత్రం పదివేల క్లిక్‌ల దూరంలో ఉన్నావు.''
అయితే మిత్రులారా, సెల్‌ఫోన్‌లు వచ్చిన తరువాత ఫొటోగ్రాఫర్ కాని వాడు ఏ లెన్స్ పెట్టి వెతికినా దొరకడు అన్నట్టు తయారైంది పరిస్థితి. కాన్వాస్ మీద గీసే ప్రతి పిచ్చి గీతా, చిత్రం కానట్టే, ఏది పడితే అది, ఎలా పడితే అలా తీయడమే ఫోటోగ్రఫీ కాదు. అయితే ప్రతి ఒక్కరూ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ లాగా మారాలని, అలా అయితేనే ఫోటోలు తీయాలని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఫోటోగ్రఫీని ఒక చక్కటి అభిలాషలాగా కొనసాగించాలి అనుకొంటే మాత్రం, కొంత ఏకాగ్రతతో శ్రద్ధగా చేస్తే ఎవరైనా గొప్ప ఫోటోలు కాకపోయినా చూడ చక్కని ఫోటోలు తీయొచ్చు. ఏమో, గుర్రం ఎగరావచ్చు అన్నట్టు ఇంకాస్త ముందుకెళితే గొప్ప ఫొటో గ్రాఫర్‌గా కూడా మారిపోవచ్చు. అయితే ఇందులో ఉన్న ముఖ్యమైన రకాలను గమనిద్దాం.
1. Wedding Photo graphy
2. Nature Photography (Landscape and Wildlife)
3. Street Photography
4. Macro Photography
5. Fine Art Photography ఇలా కొన్ని రకాలు ఉన్నాయి. వాటిలో మీ అభిరుచిని బట్టి కషి చేస్తే తప్పకుండా ఎవరైనా మంచి ఫోటోలు తీయగలరు.
A photo can speak thousand words అనే లాగా ఫోటో తీయాలంటే మాత్రం, ఫొటోలో కేవలం బొమ్మలే కాకుండా ఆ బొమ్మలు మనకు ఓ గొప్ప కథను వినిపించ గలగాలి. మన గుండెల్ని కదిలించ గలగాలి. అలా ఫొటోలు తీసే స్థాయికి ఎవ్వరైనా వెళ్లాలని అనుకొంటే, ప్రపంచ ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్‌లు తీసిన గొప్ప గొప్ప ఫోటోలను అప్పుడప్పుడూ గమనిస్తూ ఉండాలి. ''కథలు రాయడం రావాలంటే, ముందు కథలు చదవడం రావాలి'' అంటాడు రావి శాస్త్రి. అలాగే, గొప్ప ఫొటోలు తీయాలంటే, ముందు గొప్ప ఫొటోలు చూడాలి. ప్రతి ఫొటోగ్రఫీ రంగంలోనూ నాకు నచ్చిన గొప్ప గొప్ప ఫొటోగ్రాఫర్ లు ఎందరో ఉన్నారు. అందర్నీ ఇక్కడ ఉటంకించడం కుదరదు. అందుకే ఒకరిద్దర్నీ చెబుతున్నాను. Ansal Adams అనే ప్రఖ్యాత అమెరికన్ ప్రకతి ఫొటోగ్రాఫర్ అంటే నాకు చాలా ఇష్టం. ఫోటోగ్రఫీ తొలినాళ్ళలోనే ఆయన తీసిన ఫోటోలు ఇప్పటికీ కళా ఖండాలు. ముఖ్యంగా వెలుగు నీడల్ని పట్టుకొనే ఆయన నేర్పు అమోఘం. ఎక్కువుగా ఆయన నలుపు తెలుపు ఫొటోలనే తీసినా, వాటి అందం వర్ణనాతీతం. అలాగే స్ట్రీట్ ఫొటోగ్రఫీలో మన దేశానికి చెందిన రఘురారు గారు, స్టీవ్ మెకర్రి గార్ల ఫొటోలన్నా, ఫైన్ ఆర్ట్ ఫొటోగ్రఫీలో మన హైదరాబాద్‌కు చెందిన దివంగత బండి రాజన్‌బాబు గారి ఫోటోలన్నా నాకు చాలా ఇష్టం. ఇక నా వరకు వస్తే, నేను ఎక్కువుగా ప్రకతి ఫోటోలనే తీస్తుంటా. అందులోనూ వైల్డ్ లైఫ్ అంటే, అందులోనూ పక్షుల్ని తీయడమంటే నాకు చాలా చాలా ఇష్టం.
చివరగా మిత్రులారా, ఫోటోగ్రఫీ చాలా గొప్ప సరదాని, సంతోషాన్ని ఇచ్చే వ్యాపకం. ఫోటోలు తీసేప్పుడు మనకు ఎంత ఆనందం కలుగుతుందో, ఆ ఫోటోలు చూసిన వారికి కూడా అందులో ఎంతో కొంత ఆనందాన్ని మనం పంచగలుగుతాం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కనుక మీలో కూడా ఓ మంచి ఫొటోగ్రాఫర్ దాగున్నాడేమో ఎవరికి తెలుసు. కాబట్టి, కెమెరా చేతబట్టి లేదంటే చేతిలో సెల్‌ఫోన్ ఎలాగూ ఉంది కాబట్టి ఇక పని పట్టండి.
- ఎస్.ఎస్.బి.గేరా, 94929 22492
ఫొటో తీయటమంటే ఓ కథ రాయటం
మూడేళ్ళ చిన్నారీ కథరాయగలదు... తన కథ పేరు ఫొటో.. కథలన్నీ పుస్తకాల్లోనే ఉండవు.. ఆమాటకొస్తే పుస్తకాల్లో చేరే కథలు కొన్నే.. చాలా కథలు ఆల్బంలలో ఉంటారు... అవును ప్రతి ఫొటో ఓ నిశ్శబ్ద కథ.. ఎందుకంటే దైనందిన జీవితం నిండా, ప్రకతి అణువణువునా ఎన్నో కథలుంటారు వాటన్నిటినీ బంధించేది కెమెరా.. ఆశ్చర్యంగా అనిపిస్తే మీ ఇంట్లో ఆల్బం పేజీలు తిప్పేసి చూడు ఒకో చాయా చిత్రం వెనుక ఒకో కథ కనిపించటమే కాదు వినిపిస్తుంది... అదుగో ఆ కథలు చదివేందుకే మనం ఇలా ఆల్బంలు రూపొందించు కోవటం..
వథా పోతున్న వీధి కుళాయిని ఎవరూ కట్టేయనట్టు సందర్భాల ధారకు చాలా సందర్భాల్లో విలువ ఇవ్వం.. ఆ సందర్భాలు జ్ఞాపకాలుగా మారిపోయాక అరరే.. సొంతం చేసుకోలేక పోయామని చింతిస్తాం.. కానీ ఫొటో స్పహ కలిగి ఉండే ఎవరైనా సందర్భాల్ని ఒడిసిపట్టగలుగుతారు..
నీకు ఫొటో తీయటం వస్తే నీకు కథరాయటమూ తెలుసు... ఫొటో తీయగలిగిన ఎవరైనా ఆ సజన చేయగలరని రాయగలరని అర్థం.. ఫొటో అంటే కథ అని సజనాత్మక నిర్వచనం.. అవును ప్రతి చాయాచిత్రం వెనుక ఒక కథ దాగి ఉంటుంది.. వినగలిగే అభిరుచి ఉంటే ప్రతి ఫొటో ఒక కథ చెబుతుంది.. డిజిటల్ టెక్నాలజీ రాకతో ఇప్పుడంటే మూడేళ్ళ పిల్లలు మొదలు మనమంతా ఈ తరహా కథా రచయితలం అయిపోతున్నాం కానీ.. గత పది, పదిహేహేనేళ్ల క్రితం దాకా ఈ కథా రచన ఫొటోగ్రాఫర్ అనే టెక్నీషియన్స్‌కు మాత్రమే సాధ్యపడేది..
ఫొటో కేవలం కథ మాత్రమే కాదు టైం మిషన్ కూడా గతంలోకి మనల్ని మోసుకుపోతుంది.. పాతకాలం నాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటో చూస్తుంటే ఒక పురాతన రాత ప్రతినో గ్రంథాన్నో చూస్తున్న అనుభూతికి లోనవ్వని భావుకులుండరు.. ఆరోజేం జరిగింది, అక్కడ అప్పుడేముంది.. అప్పుడేమయ్యింది ఆ ఫోటో ఎట్లా పుట్తింది ఫొటోలోని దశ్యాల తాలూకు వ్యక్తులు, ప్రాంతం, ప్రకతి వనరులు ఇప్పుడెలా రూపాంతరం చెందాయో కొత్త తరాలకు కథలు కథలుగానే చెపుతాయి.. అయితే ఫొటోను యాంత్రికంగా చూడటం కాక ఒక అనుభూతి స్పర్శతో తాకాలి ఫొటోను చూడటం కాదు ఫోటోలోకి చూడగలగాలి...
కాలాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. నిన్నటి చివురైనా రేపటికి పండుబారి రాలిపోవాల్సిందే.. కానీ కదిలే ఆ కాలాన్ని సైతం చిత్రించి భద్రపరిచే మహత్తు ఫొటోకు ఉంది.. ఫొటో క్లిక్ మనిపిస్తే క్షణాన్ని నమోదు చేసినట్టే.. ఫొటో వెనుకటి కాలానికి రివైండ్ బటన్.. మధుర స్మతులను సంతోష సందర్భాలను ఆనంద ఘట్టాలను కదలక, కరగక నిశ్చలం చేసే పాజ్ బటన్..
జీవితం సంఘటనల సమాహారం ఫొటో వాటిల్లో చాలా సందర్భాల సాక్ష్యం.. పుట్టింది మొదలు యాత్ర చాలించే వరకు.. కనుకనే శూభకార్యాలకు మనం ఆహ్వానించే స్నేహితుడు ఫొటో..
ప్రకతిని సొంతం చేసుకోలేకపోవచ్చు కానీ బంధించి వెంట తెచ్చుకోగలం, ఎప్పుడంటే అప్పుడు పరిచయం చేయ గలం.. తీసిన ప్రతి ఫొటో మరణించే క్షణాలకు ప్రాణం పోస్తుండటం.. వెళ్ళిపోతున్న క్షణాలు కాలంలోకి మళ్ళీ వెనుక్కొచ్చేందుకు టిక్కెట్ కొనివ్వటం..
ఎగిరే పక్షి, ఆడే నెమలి, దూకే పులి, పరుగెత్తే జింక, సమస్తాది వన్య ప్రాణులే కాక అడవి, జలపాతం, కొండలు గుట్టలు, నదులు, ఆనకట్టలు, సెలఏర్లు, గుళ్ళు గోపురాలు, పల్లెలు నగరాలు, రైలు పట్టాలు రైలు పెట్టెలు గుర్రం బండ్లు ఎడ్ల బండ్లు ఎన్నెన్నో ఫొటోలు చూసిన ప్రతిసారీ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.. అందాల ప్రపంచానికి ఫొటో ఒక సాక్ష్యం..
ఫొటోగ్రఫీ అభిరుచి ఉంటే ఎడారి నడకా విసుగని పించదు.. ఇసుకలో ఒంటెల కాలిపట్టీలు దొరుకుతారు.. ఆనవాళ్ళు పట్టిపోతే వయ్యారి ఓడలూ అందుతారు.. ఫొటో మన మొదటి ప్రేమ.. ఈ ప్రేమ లేనోళ్ళెవరు.. బతుకును ప్రేమించే వాళ్లంతా ఫొటోను ప్రేమిస్తారు..
నువ్వు మిత భాషివైనా సరే ఫొటోలు మాత్రం ఎక్కువ తిరు.. నీదైన ప్రత్యేక గొంతుకేదో అవి లోకానికి వినిపిస్తారు.. నువు తీసే ఫొటో నీ వ్యక్తిత్వవకాల్తా.. ఫొటోని మనం ఎంచు కోవటం కాదు, ఫొటోనే మనల్ని ఎంచుకుంటుంది.. అయితే ఎప్పుడూ కనపడే దశ్యాన్ని ఫొటో తీయకు. అదేం మాట్లాడు తోందో దాన్ని బంధించు.. అప్పుడే అది ఎప్పటికీ సజీవమ వుతుంది.. కొందరు ఈ విషయంలో విఫలమవుతుం టారు వాళ్లు కథ రాయటంలో ఓడిపోతుంటారు.. వాళ్ళ వేళ్ళు కెమెరా షట్టర్‌తోనే స్నేహం చేస్తుంటారు చుట్టూ ఉన్న మను షులతో కాదని అర్థం. ఎందుకంటే ప్రతిమనిషి ఓ కదిలే చిత్రం..
- కె.శ్రీనివాస్, 9346611455