Plain paper లాంటి నీలాల గగనాన్ని మానవ హక్కుల నక్షత్రాలతో అలంకరిస్తే అవి అరుణ తారలై మెరిసిపోతాయి. అప్పుడు మనం అరుణారుణ ఆకాశం ఎంత అందంగా ఉంది అనుకుంటాం. సరిగ్గా అంతే! 'మానవ హక్కులు లేని ప్రజాస్వామ్యాలు' పది కాలాలు నిలువలేవు. వెలవెలాపోతాయి. కానీ 'మానవ హక్కులు' అనే పదం రాజ్యానికి చాలా భయంకరంగా వినిపిస్తుంది. మనుషులతో పాటు ఈ పదం కూడా అణచివేతకు గురి అయింది. మానవ హక్కుల దినాన్ని డిసెంబరు 10న అంతర్జాతీయ సమాజం సంబరంగా జరుపుకుంటుంది. మానవ హక్కులే స్త్రీల హక్కులు (Human Rights are Women Rights) అంటూ అంతర్జాతీయ మహిళా ఉద్యమాలు గొంతెత్తి చాటాయి. based Voilence మీద పిడికిలి బిగించాయి. స్త్రీల మీద జరిగే అన్ని రకాల హింసను ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు 16రోజుల పాటు (నవంబరు 24 నుండి డిసెంబర్ 10) కాంపెయిన్ నిర్వహిస్తారు. స్త్రీల హక్కుల గురించి చర్చిస్తారు. ఈ హక్కుల స్పృహను మనకు అందించిన మాతృ సంస్థ గురించి మాట్లాడుకుందాం... ఐక్యరాజ్యసమితి (United Nations) ఏర్పడి 75 సంవత్సరాలు అవుతుంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి కూడా దాదాపు 75 సం|| అవుతుంది. UN 1948 డిసెంబర్ 10న Universal Declaration of Human Rightsని ఆమోదించింది. ఇది ఒక International Law. ప్రపంచ దేశాలు అన్నీ దీన్ని ఆమోదించి, అమలు జరపాలి. ఇందులో 30 Articles ఉన్నాయి. దాదాపు అన్ని Articles వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం గురించి మాట్లాడుతాయి. హక్కుల పునాది మీద UN Declarationఅని సుస్థిరం చేస్తాయి. 75 సం||ల పాటు ప్రపంచ దేశాలతో కలిసి, శాంతి సమానత్వం కోసం పని చేసిన UN ఈ సంవత్సరం వేడుకలు చేసుకుంది. Thankyou United Nations అంటూ ప్రపంచ దేశాలు సందేశాలు పంపాయి. మానవ హక్కుల గురించి మాట్లాడుకోవడమంటే UN గురించి మాట్లాడుకోవడమే. ఈ 75సం||ల కాలంలో UN ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పనులు చేసింది. చాలా యుద్ధాలను ఆపింది. శాంతి చర్చలు జరిపింది. పేద దేశాలకు Humanitarien Aid అందించింది. రాజకీయ అస్థిరత, అంతర్ యుద్ధాలు చోటుచేసుకున్న ప్రాంతాలకు Peace Keeping Missionని పంపి, శాంతిని పున:స్థాపన చేసింది. స్త్రీల ఉద్యమాలకు, సామాజిక సేవా సంస్థలకు చేయూతనిచ్చింది. ఇప్పుడు ప్రత్యేకంగా UN స్త్రీల విభాగం ఏర్పడింది. ఒక దశాబ్ద కాలం చేసిన పనిని United Nationsతో పాటు UN Women@10 కూడా ఉత్సవాలు జరుపుకుంటుంది. ఈ పనులన్నీ మానవ హక్కుల Charterలో భాగమే. UN చేసే ప్రతి పనిలో, ప్రతి Policyలో మానవ హక్కులు అంతర్భాగం. UN నిర్వహించిన ప్రపంచ స్త్రీల సదస్సుకు నేను ఆహ్వానాన్ని అందుకున్నాను. 2000 సం||లో న్యూయార్క్, అమెరికాలో జరిగిన ఈ సదస్సులో నేను పాల్గొన్నాను. Femisinst కవయిత్రిగా, మానవ హక్కుల Advocateగా United Nations Head Quartersలో జరిగిన ఈ సదస్సులో నా గొంతు వినిపిం చాను. మీనా అలెగ్జాండర్ లాంటి ప్రపంచ స్థాయి కవయిత్రులతో కలిసి మాట్లాడడం, నా కవిత్వం వినిపించడం అంతర్జాతీయ వేదిక మీద ఒక మంచి జ్ఞాపకం. ఈ సదస్సులో అనేక రంగుల్లో స్త్రీలను (Women of colour) చూసాను. ఇది ఒక మరుపురాని అనుభూతి. ఈ ప్రేరణతో ''డాటర్స్ కింగ్‌డమ్'' అని ఒక కవిత రాసుకున్నాను. ఈ స్త్రీల సదస్సు నాకు ప్రపంచాన్ని చూపించింది. నాకు అమెరికాని పరిచయం చేసింది. దీని వల్ల మానవ హక్కుల నేపథ్యం, దాని పరిధి మరింతగా నాకు అవగతమైంది. శాంతి, రక్షణ (Peace and Security) లాంటి కీలక విభాగాల పరిరక్షణ కోసం, ఇందులో సుస్థిరతను సాధించడంలో మానవ హక్కులు ప్రధాన భూమిక నిర్వహిస్తాయి అని UN Human Rights Charter చెప్తుంది. 75 సంవత్సరాల కాలం చిన్నదేమీ కాదు. UN ఎంతో సాధించింది. ఇంకా సాధించాల్సింది, చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. Cross Boarder Terrorism, Trafficing, Protection of Minorities లాంటి అంశాల మీద ఇంకా UN పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా హింస ఎక్కువ అయింది. Violence is a Global Phenomenon. మానవ సమాజాన్ని వినాశనం వైపుకు తీసుకువెళ్తుంది హింస. ఈ విషయాన్ని UN అలక్ష్యం చేస్తే, మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు ప్రపంచ దేశాలు ప్రమాదంలో పడిపోతాయి. అయితే ప్రపంచ దేశాల సమిష్టి సహకారంతో మనం UNతో కలిసి ప్రపంచ శాంతిని, సుస్థిర అభివృద్ధిని (Sustainable Development) సాధించగలం. రాజ్యాలు, రాజకీయాలే కాకుండా, UN Frame Workలో స్త్రీల హక్కులు, పిల్లల హక్కులు, Rights of the Senior Citizens, Persons with Disabilities లాంటి అంశాలు కూడా ఉన్నాయి. UNICEF లాంటి సంస్థలు పిల్లల హక్కుల కోసం (Convention on the rights of the Child) పని చేస్తున్నాయి. ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాపించి దారుణ ఆరోగ్య పరిస్థితులు సంభవించిన సందర్భరలో, ప్రపంచ దేశాలన్నీ కష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సందర్భంలో, అనేక సమస్యలు, ఆర్ధిక మాంధ్యం, ఆరోగ్య సంక్షోభం లాంటి అగమ్య గోచర సందర్భంలో యునైటెడ్ నేషన్స్ 75 సం||ల వార్షికోత్సవంలో అడుగు పెట్టింది. నిజంగా ఇది ఒక చాలెంజ్ లాంటి సమయం. దీన్ని అందరం కలిసి ఎదుర్కోవాలి. స్త్రీల ఉద్యమాలకు కార్యాచరణ ప్రణాళికలను ఇచ్చి, స్త్రీల పోరాటాలకు దారి చూపించిన UN ఈ రోజు మనకు ఒక శాంతి దేవత. ఈరోజు Climate Crisis అనేది ప్రపంచ దేశాల ముందు పెను సవాలుగా నిలబడింది. దీన్ని ఎదుర్కొని, మరింత మెరుగైన జీవనం కోసం, పరిశుద్ధ వాతావరణం కోసం UN ప్రపంచ దేశాలకు 17 లక్ష్యాలను (2015) ఇచ్చింది. వీటిని రాబోయే 10 సం||లలో (2030) ప్రపంచ దేశాలు సాధించాలి. ఈ లక్ష్యాలను UN-SDGs అంటారు. అంటే Sustainable Development Goals. ఇప్పుడు మన దేశం గురించి మాట్లాడుకుంటే, వీటిని మనం నిజంగా రాబోయే 10 సం||లలో సాధించగలమా? గత 5సం||ల కాలంలో ఏం సాధించాం SDGsకు సంబంధించి? పర్యావరణానికి సంబంధించి, ఇప్పటికే చాలా దేశాలు చాలా సాధించి, ముందుకు వెళ్లిపోయాయి. మన మాతృభూమి గురించి ఆలోచిస్తే... మనం ఎప్పటికైనా పెద్ద దేశాల పక్కన తల ఎత్తుకు నిలబడగలమా అనిపిస్తుంది. ప్రపంచానికి మనం పెద్ద ప్రజాస్వామిక దేశం. కాని మనకు మాత్రం పేద భారతదేశం సంపన్న India అనే రెండు రకాలుగా మన దేశం కనిపిస్తుంది. అంటే వర్గ వైషమ్యాలు, పేద, గొప్ప తారతామ్యాలు బాగా పెరిగిపోయాయి. పేద వాళ్ళు మరింతగా 'దారిద్య్రరేఖ' దిగువకు వెళ్తున్నారు. Neo rich పెరుగుతుంది. కులం, మతం ప్రాధాన్యత పెరిగిపోయింది. మైనారిటీల మీద, స్త్రీల మీద హింస పరాకాష్టకు చేరుకుంది. అడుగడుగునా పేదరికం కనిపిస్తుంది. దీంతో పాటు హక్కుల అణచివేత తీవ్రస్థాయిలో కనిపిస్తుంది. ప్రశ్నించడమే దేశ ద్రోహమవుతున్న చారిత్రక సందర్భంలో మనమున్నాం. నేరస్తులు స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే, సమాజానికి పనికి వచ్చే నాలుగు అక్షరాలు రాసుకునే కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారు. కరోనా లాక్‌డౌన్ సందర్భంలో కార్మికులు ఎలా రోడ్డున పడ్డారో మనం చూసాం. కార్మిక హక్కుల చట్టాలను కుదించి వేయడం ద్వారా వాళ్ళ శ్రమదోపిడీకి అవకాశం కలుగుతుంది. ఈ అవకాశాన్ని కార్పొరేట్ సంస్థలకు కలిగించడం ద్వారా ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసి, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుంది. అలాగే రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవి చాలవన్నట్టు, ఏ మాత్రం రైతులకు పనికిరాని కొత్త చట్టాలు తెచ్చి, మరింతగా రైతుల జీవితాలను అల్లకల్లోలం చేస్తుంది ప్రభుత్వం. Globalization విధానాల వల్ల వ్యవసాయం అడుగంటి పోయింది. దేశంలో వ్యవసాయం లేకపోవడమంటే, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి తగ్గిపోవడమంటే ప్రజల జీవితాలు ప్రమాదంలో పడిపోవడమే. ఆహార భద్రతకు (Food Security) తీవ్ర విఖాతం కలుగుతుంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తుంది. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఎలాగూ లేదు, కనీసం వాళ్ళ వీలునుబట్టి ఏ పంట పండించుకోవాలో నిర్ణయించుకునే హక్కు కూడా లేదు రైతులకు. అలాగే దేశంలోని పేదవాళ్ళకు, దిక్కుమొక్కు లేని దీన జనానికి ఏం దొరికితే అది తింటారు. ఈ రోజు India's Food Politics మనల్ని శాసిస్తున్నాయి. మనం ఏం తినాలో చెప్తున్నాయి. పేద భారతదేశంలో అందరికీ మటన్ బిర్యానీ, తందూరీ చికెన్, ఫిష్ ఫ్రై లాంటివి దొరకవుగా! ఈ ఆహార పదార్ధాలు సంపన్నులకు మాత్రమే పరిమితం. పేదవాళ్ళు ఏం దొరికితే అదే తింటారు. సజీవంగా ఉన్న నిలువెత్తు మనిషిని ఈ ఆహారం తినడానికి వీలులేదు అంటూ చంపేసిన ఉదంతం దేశ ప్రజలు మరిచిపోలేదు. నా మాతృభూమిలో జరుగుతున్న ప్రతీ మానవ హక్కుల ఉల్లంఘనకు చరిత్ర సాక్షిగా ఉంది. అంతర్జాతీయ సమాజం నిసితంగా దీన్ని గమనిస్తుంది. UN ప్రతి దేశానికి ఇచ్చిన సుస్థిర లక్ష్యాల (Sustainable Development Goals -SDGs)లో భాగంగా ఒకమాట పదేపదే అంటుంది. అది Leaving No one Behind అని. ఎవర్ని వెనక్కి వదిలేయొద్దు, అందర్ని అభివృద్ధిలో భాగస్వాముల్ని చేయండి అని. మరింత స్పష్టంగా అర్థం అయ్యేటట్టు మాట్లాడుకుంటే- మైనారిటీలను, దళితులను, ఆదివాసీలను, పేదవాళ్ళను అణచివేయొద్దు, వాళ్ళను జన జీవన స్రవంతిలో కలపండి అని అర్థం. అందుకే, ఇంత స్పష్టంగా ప్రజల గురించి ప్రపంచ దేశాలకు యూనైటెడ్ నేషన్స్ సందేశం ఇచ్చింది. కాబట్టి, ఈ రోజు ప్రపంచ ప్రజలు UNని అభినందిస్తున్నారు. The Future We Want, The UN We Need అంటూ. దేశాల మధ్య దౌత్యసంబంధాలను (Deplomatic Relations) పటిష్టం చేస్తూ, సరిహద్దు దేశాల మధ్య శాంతిని నెలకొల్పుతూ ఈ రోజు UN అందరి మన్నలను అందుకుంటుంది. 2019లో మన దేశానికి UN Military Gender Advocate Award అవార్డు వచ్చింది. ఇది సైన్యంలో స్త్రీల చైతన్యం కోసం ఇస్తారు. UN@75 Declaration calls for Multilateralism to Achive Equal, resilent World. అవును, నా దేశం కూడా ఇదే కోరుకుంటుంది. భిన్నత్వంలో ఏకత్వం, Cultural Pluralism. మానవత్వ పరిమళాలు వెదజల్లే మానవ హక్కుల తోటలా మనం మన మాతృభూమిని తీర్చి దిద్దుకుందాం. నిజమైన ప్రజాస్వామిక దేశంలా ప్రపంచం ముందు నిలబడదాం. నన
- మహెజబీన్ ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, సామాజిక వేత్త, మానవ హక్కుల న్యాయవాది.