Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆదిలాబాద్‌అర్బన్
తెలంగాణలో ప్రతియేటా దసరాతోపాటు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రకృతిలో లభించే తిరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఆడపడుచులు ఆటలు ఆడుతారు.9వ రోజున సద్దుల బతు కమ్మ, మరుసటి రోజు దసరా పండుగను జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 28న జరగనున్న బతుకమ్మ పండుగ ప్రత్యేకత ఉంది. బతుకమ్మ పండుగను పురస్కరిం చుకుని తెలంగాణ సర్కార్ ఆడపడుచుకులకు చీరలను కానుకగా ఇచ్చేందుకు నిర్ణయి ంచింది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి లబ్దిదారుల గుర్తింపు చేపట్టారు.చీర లను సైతం కేటాయించిన గోదాములకు తరలించడంలో నిమగమయ్యారు.ఈ చీర లను చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 2,29,169 మంది
జిల్లావ్యాప్తంగా మొత్తం 355 రేషన్ దుకాణాలు ఉన్నాయి.18 మండలాల పరిధిలో 2,29,169 మంది మహిళలను గుర్తించారు. చీరలను నిల్వ చేసేందుకు ఆరు గోదాములను కేటాయించారు.గుర్తించిన మహిళలందరికీ ప్రభుత్వం ఉచితంగా చీరలను పంపిణీ చేయనుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రంజాన్ సందర్భంగా పేద ముస్లిములకు, క్రిస్మస్ సందర్భంగా పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తున్న విషయం విధితమే. ఈసారి బతుకమ్మ పండగను పురస్కరించుకుని మహిళలకు ఉచితంగా చీరలను అందించనుంది. జిల్లాలోని 355 రేషన్‌షాపుల్లో సెప్టెంబర్ 18,19,20 తేదీల్లో ఈ చీరలను పంపిణీ చేయనుంది.చీరలు తీసుకు నేటప్పుడు ఓటర్ గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు తీసుకుని వెళ్లాలి. రేషన్ దుకాణం వద్దకు మహిళలు రాలేని పరిస్థితి ఉంటే వారి భర్త లేదంటే తండ్రి, ఎవరు వచ్చినా ఇస్తారు.
చీరల నిల్వకోసం ఆరు గోదాములు ఎంపిక
సెప్టెంబర్ 15న బతుకమ్మ చీరలు జిల్లాకు చేరునున్నాయి.జిల్లా యంత్రాంగం ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లు చేస్తోంది. స్టాక్ పాయింట్లుగా నియోజ కవర్గాల వారీగా ఆదిలాబాద్ అర్బన్, రూరల్, తాంసి, భీంపూర్, తలమ డుగుకు సంబంధించి చీరల నిల్వ కోసం ఆదిలాబాద్ మార్కెట్ యార్డును ఎంపిక చేశారు.అలాగే బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్కు సంబందించి బోథ్ మార్కెట్‌యార్డు, ఇచ్చోడ, గుడిహత్నూర్, సిరికొండకు సంబంధించిన చీరలను ఇచ్చోడ మార్కెట్‌యార్డులో నిల్వ చేయనున్నారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాలకు సంబంధించిన చీరలను ఇంద్రవెల్లి మార్కెట్‌యార్డు గోదాం, నార్నూర్, గాదిగూడ మండలాలకు సంబంధించి నార్నూర్ మార్కెట్‌యార్డు గోదాంలో నిల్వ చేయ నున్నారు. జైనథ్, బేల మండలాలకు సంబంధించిన చీరలను నిల్వచేయడానికి జైనథ్ మార్కెట్‌యార్డు గోదాంను ఎంపిక చేశారు. కమిటీ సభ్యులుగా మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు వ్యవహరించ నున్నారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, లేదంటే వీఆర్ఓ, గ్రామైక్య సంఘం సభ్యురాలు, రేషన్‌షాపు డీలర్లు సభ్యులుగా వ్యవహరించనున్నట్టు సమాచారం.
మండలాలవారీగా పంపిణీ చేయనున్న చీరలు
మండలం రేషన్‌షాపులు మహిళల సంఖ్య
1. ఆదిలాబాద్ 43 34775
2. ఆదిలాబాద్ రూరల్ 26 14544
3. బజార్హత్నూర్ 21 9261
4. బేల 25 13318
5. భీంపూర్ 15 8249
6. బోథ్ 24 15948
7. గాదిగూడ 10 6533
8. గుడిహత్నూర్ 12 10176
9. ఇచ్చోడ 19 13786
10. ఇంద్రవెల్లి 16 13025
11. జైనథ్ 38 17355
12. మావల 10 11193
13. నార్నూర్ 14 9421
14. నేరడిగొండ 16 9356
15. సిరికొండ 08 5707
16. తలమడుగు 16 11855
17. తాంసి 10 5890
18. ఉట్నూర్ 32 19077
మొత్తం 355 229169