సన్నకారు రైతన్న మనం సవాల్ చేద్దామామన ఏలికల ఘనతేదో ఎరుకజేద్దామా!ఉరికి ఉరిమి ఒక్కసారి ఉప్పెనైదమామనకొంప గూల్చేటోళ్లను ముంచిపోదమా!! //సన్నకారు//ఆత్మహత్యల పరంపర ఆగకుండా జరుగుడేందికడుపునింపే రైతులకు కడుపుకోత మిగులుడేంది!అప్పులతో జీవితం అణచబడి ఉండుడేందిదళారుల రాజ్యమే దర్జాగా సాగుడేంది!! //సన్నకారు//పూటడవని రైతుకు రుణమివ్వక పోవుడేంది!సరాసరి ఇచ్చేటోడికి సందుగూడ ఇవ్వరేందిఎగబెట్టేటోనికే ఎనుకబడి ఇచ్చుడేంది!! //సన్నకారు//సబ్బులోడు, సర్ఫులోడు స్టిక్కరేసి పెట్టుడేందిదండిగ పండించేటోడు ధరలేక సచ్చుడేంది!ప్రపంచాన్ని సాదెటోడు పురుగుమందు తాగుడేందిఅందరినీ ముంచెటోడు ఆస్తులు ఎనుకేసుడేంది!! //సన్నకారు//-సముద్రాల కుమారస్వామిపీజీటీ, తెలుగుమోడల్ స్కూల్, చిట్యాల, జయశంకర్ మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు జీవితమే చదరంగం ..