71 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవమా! వత్సరమా! నింగిలోన రెపరెపలాడుతున్న స్వేచ్ఛా త్రివర్ణపతాకమా నీకు వందనాలు! జాతీయ గీతాలాపన వందనాలు దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు దేశంలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న జనాలు ప్రగతి పథంలో భారత్ ముందంజలో అంటూ నాయకులు మాటలు మరోవైపు అవిద్య, పేదరికం, వెనుకబాటుతనంతో తంటాలు అవినీతిలో అగ్రపథాన దూసుకెళ్లున్న మన దేశం సంపాదనే ధ్యేయంగా రాజకీయ నాయకులు కోట్లు కూడబెడ్డున్న వైనం ఓ స్వాతంత్య్రమా! దేశాన్ని మార్చలేవా! అహింసే ఆయుధంగా తెల్లదొరలను తరిమికొట్టిన నాటి పుణ్యపురుషులు హింసలే నేటి ఆయుధంగా.. వెలుగొందుతున్న భారతం ఒకవైపు సరిహద్దుల్లో నిత్యం కాల్పుల మోతలు - అమరులవుతున్న జవానులు మరోవైపు గోరఖ్కూర్లో అభంశుభం తెలియని చిన్న పిల్లల మరణాలు హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు ఓ స్వాతత్య్ర దినోత్సవమా! ఈ దేశాన్ని మార్చలేవా! స్వాతంత్య్ర దినోత్సవాన్ని సంబరంగా జరుపుకోవాలని నాయకుల మాటలు స్వాతంత్య్రమంటే ఏమిటో తెలియని కుగ్రామాలు పల్లెలకు, సామాన్యులకు దరిచేరని ప్రభుత్వ పథకాలు అభివృద్ధి చెందుతున్న దేశంగా పిలువబడుతున్న దేశమా నీకు వందనాలు! జాతీయ గీతాలాపన వందనాలు -కామిడి సతీష్‌రెడ్డి (టీచర్) కర్కపల్లి, జయశంకర్ 9848445134 (తెలుగు రక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు)