ఎగిరింది మన జెండా ఎర్రకోటపైనా మురిసింది మన జాతి మూడు రంగుల జెండా అమర వీరుల రూపు అలంకారంగా సమర భూమిలోన రెపరెపలాడింది నెలకొరిగినారు.. నింగికెసినారు వేల కొలది త్యాగధనులు స్వతంత్ర పోరాటంలో అసువుల బాసారు రా.. అమరులైనారు రా.. స్వరాజ్య సంపాదనలో సమిధలైనురాల.. (నేల) తిరగబడ్డ నేతాజీ తిరుగుబాటు నేర్పాడు విల్లుబట్టి అల్లూరి రమణనందు దూకాడు భగత్ సింగ్, సుఖ్‌దేవ్‌లు ఉరికంబం ఎక్కారు భరతమాత ఒడిలోన ముద్దు బిడ్డలైనారు జాతి గుండల్లో నేటికీ చిరంజీవులైనారు
బాసిన సంకెళ్లు తెంచే అహింసా బాపూజీ శాంతి మంత్రమే జపించి గెలిపించెను చాచాజీ గుండె చూపి టంగుటూరి ధైర్యాన్ని నింపాడు సమర భూమి సారధిగా చరిత్రలకెక్కాడు భావి భారతావనికి వారధిగా నిలిచాడు
ఆ త్యాగం... ఆ ధైర్యం నేటితరం మరువద్దు అవినీతి నాయకులను అసెంబ్లీకి పంపొంద్దు సాధించిన స్వతంత్రాన్ని అపహాస్యం చేయోద్దు ఏడాదికి ఒక్కరోజు పండుగంటే స్వతంత్రమా ఇది పింగళి రూపొందించిన జాతీయ పతాకమా రవీంద్రుడు రాసినట్టి జాతీయ గీతమా
తెల్లనోడిని తరిమికొట్టి తెచ్చుకున్న స్వతంత్రం మచ్చలేని నాయకులను మనకిచ్చిన స్వరాజ్యం కులమతాల గోడలను కూల్చలేక పోయిందా పేదవాడి గుడిసె దాకా దాలేనని అంటుందా రంగు రాజకీయాలకి దాసోహం అయిందా రాజకీయ నాయకలకు బానిసగా మారిందా