- జనార్దన్‌రెడ్డికి ప్రతిపాదనలు అందజేత
- అధ్యయనం చేస్తామన్న కమిషనర్
నవతెలంగాణ - సిటీబ్యూరో
పాతబస్తీ అభివృద్ధిపై మజ్లీస్ పార్టీ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డితో మంగళవారం సమావేశమయ్యారు. రహదారుల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కమిషనర్‌కు అక్బరుద్దీన్ ఓవైసీ వివరించారు. అక్బరుద్దీన్ ఓవైసీ ఇచ్చిన ప్రతిపాదనలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. ప్రతిపాదిత పనుల్లో ఇప్పటికే కొన్నింటిని డీపీఆర్‌లు సిద్ధమయ్యాయని, మిగిలిన పనుల విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్టు కమిషనర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అమీనుల్ జాఫ్రి, ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, బలాల, జీహెచ్ఎంసీచీఫ్ ఇంజనీర్లు జియాఉద్దీన్, శ్రీధర్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రతిపాదనలు ఇలా...
-కందికల్‌గేట్ నుంచి బార్కాస్ వరకు సులభతర ప్రయాణానికిగాను చాంద్రాయణ గుట్ట వద్ద ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిని మరో 200 మీటర్ల మేర పొడవుకు విస్తరించాలి.
-మిథాని వద్ద అండర్‌పాస్ నిర్మాణం.
- బార్కాస్ వద్ద శిథిలావస్థలో ఉన్న మార్కెట్‌ను తొలగించి కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించాలి.
-బార్కాస్‌లో ఖాళీగా ఉన్న స్థలాన్ని క్రీడా మైదానంగా అభివృద్ధి చేయడం.
-బండ్లగూడ రోడ్‌ను విస్తరించాలి.
-ఈదీ బజార్ నుంచి రక్షాపురం వరకు ప్రస్తుతం ఉన్న రోడ్ వెడల్పుకు భూసేకరణ చెల్లింపులు జరిగినప్పటికీ రోడ్డు విస్తరణ జరగలేదు. దీనిపై పూర్తి సర్వే నిర్వహించి రోడ్ విస్తరణ వెంటనే జరిపించాలి.
- ఓవైసీ హాస్పిటల్ నుంచి ఆరాంఘర్ వరకు రోడ్డు విస్తరించినప్పటికీ బీటీరోడ్ నిర్మాణం చేయకపోవడం వల్ల ప్రయివేట్ పార్కింగ్లు అధికంగా ఉన్నాయి. ఈ రోడ్డుపై ఆక్రమణలు తొలగించి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలి.
- ఆరాంఘర్ రోడ్‌పై ఉన్న చిరు వ్యాపారులకు స్ట్రీట్ వెండర్ పాలసీకి అనుగుణంగా తగు గుర్తింపు కార్డులు జారీచేయాలి.
-అపోలో ఆస్పత్రి జంక్షన్ అభివృద్ధి చేపట్టాలి.
-ముస్లీం జంగ్పూల్ నుంచి గోషామహల్ ఏసీపీ ఆఫీస్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలి.
- ఫిరంగినాలాను 120 అడుగుల మేర విస్తరణకు చర్యలు చేపట్టాలి.
- నాంపల్లి దర్గా జంక్షన్ నుంచి చికెన్ మార్కెట్ వరకు రోడ్డు విస్తరణ జరపాలి.
- మాసబ్‌ట్యాంక్ నుంచి రోడ్ నెం-1 పింఛన్ ఆఫీస్ వరకు ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టాలి.
-ఖైరతాబాద్ చింతల్ బస్తీ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం-1ను కలిపే రోడ్‌ను విస్తరించాలి.
Authorization