ఓటు... ఓ.. ఓటు ఏది ఎంత నీ రేటు మద్యంమత్తులో సుక్కబొట్టు తాగినోడు అటో...ఇటో... ఎటో... తెలియక తలగిర్రున తిరిగేటట్టు... అమ్ముకునోడికి అయితావా తాకట్టు బ్రతుకును బలిచేసే బందిపోటు... ఐదేండ్లకు ఒక్కసారి.... గడపతొక్కే నామినేటు... ఇచ్చిన వాగ్ధానాన్ని నిలచెడుతావా చెప్పు బిట్టు... మాట ఆడి మార్చిరివో... నేను ఎవర్ని అడగాలో... చెప్పు జడ్జిమెంటు... దొంగవైనా... దొరవైనా... నీకు రాజ్యాంగమే సపోటు ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవడం కరెక్ట్... వద్దు వద్దు అవినీతి పాలకులకు ఓటు నోటాకే మన ఓటు... గద్దపాటి రఘువరణ్ సెల్: 9490618735.