ఇక్కడ పార్టీలు సంకరం చేస్తేపుట్టిన కుక్కమూతి పిందెలుఖద్దరు చొక్కాలై నీరాజనాలందుకుంటాయి..ఇక్కడ ప్రపంచం నమ్మని అబద్దాలుఅత్యంత పవిత్రమైన మేనిఫెస్టోలైఓట్లను కొల్లగొడుతుంటాయి..ఇక్కడ ఏ సిద్ధాంతాలు లేని రాద్ధాంతాలుమైకులు బద్దలయ్యే మహోపన్యాసాలైఅమాయకుల చెవులలో సీసం పోస్తుంటాయిఇక్కడ ఏ ఎజెండాలు లేని జండాలుయేండ్లుగా అసత్యాలై నిలబడిప్రజల జీవితాలలో దరిద్రాన్నిచిలుకుతూనే ఉంటాయి..ఇక్కడ బ్రతుకు భారమైన ప్రజలుఓటుకు నోటుయెరలను మ్రింగిఐదేండ్లు ఐసీయూలో ఆక్సీజన్ మాస్క్తోజీవన్మరణ పోరాటం చేస్తుంటారుఇక్కడ పట్టపగలే మొఖంపైదుప్పటి కప్పుకున్నడబ్బు కట్టలు రోడ్లపై పరుగులు తీస్తూపోలీసుల చేతుల్లో పోస్టుమార్టమ్ అవుతుంటాయి...ఇక్కడ జీవనదుల్లో పుణ్యతీర్థంలాఅవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం,కులగర్వం, మతపిచ్చి, హిమాలయాలంతస్వచ్ఛంగా ప్రవహిస్తుంటుందిఎంతైనా ధర్మభూమి,కర్మభూమి కదామరీ...ఇన్ని అవలక్షణాలు లేకపోతేమన ఘనత ఆసాంతం మూసీనదిలో మునకేయదుమరీ...- యనగందుల దేవయ్య,సెల్ : 96660 36288 మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు జీవితమే చదరంగం ..