1.పాతచెప్పులను కుడుతున్నారు చర్మకారులు మాసికగుడ్డలు కడుతున్నారు చేనేతకారులు చేతి వృత్తిని పుట్టుమచ్చలా కుల గుర్తుగా మిగిల్చి వ్యాపారులై చెరపడుతున్నారు నవ కుబేరులు
2.ప్రముఖుల సరసన ఫోటోకొక ఫోజు పడతావు ఆయాచిత కీర్తి కిరీటం మీద మోజు పడతావు నిబద్దత నిమగత నిబిడతలను ఏమార్చావా నీకు నువ్వే తెలియనంతగా బూజు పడతావు - కన్నెగంటి. వెంకటయ్య. ఖమ్మం సెల్ : 98856 57582.