అంటరాని వాళ్లని ఊరి బయటకు నెట్టేసిన పెద్ద మనుషులు ఒక్కసారి ఆలోచించండి దేశరక్షణ జవానులలో పాద రక్షణ రక్షక భటుల్లో పెద్దకులాలు వాళ్ల శాతం ఎంత? అంటరాని వాళ్ల శాతం ఎంత? ఉన్నత శిఖరాల మధ్య ఎగుడుదిగుడు లోతుల్లో చలిలో విదేశీ శత్రువులు నరికట్టే వాళ్లు ఎనబైశాతం అంటరాని వాళ్లే పెత్తనం వెలగబెట్టే పెద్దోళ్లు పదిశాతం మందిలేరు గ్రామాల భూముల్లో ఉత్పత్తుల్లో పాల్గొనే అలిగా జనంలో అంటరాని వాళ్ల శాతం అధికం వాళ్లు ఆ పనులు నిరాకరిస్తే దేశ విదేశీయుల వశం అయ్యేది.. ఉత్పత్తుల మొదల్లో, భూముల్లో, వాళ్లు సమ్మె చేస్తే దేశం తల్లడిల్లి మూర్చావస్థకు చేరుద్ది అందుకే కులరహిత సమాజ అవసరాన్ని గుర్తించండి - రుక్కు రామిశెట్టి రోశయ్య, మధిర