ప్రకృతంతా ఏకమవుతోంది
ప్రళయ గర్జన చేస్తోంది
నిప్పు నీరు కలిసారు
అలరు బలరు అంటున్నారు
ఇది వింతా ? విలయ సూచనమా?
మొన్న హుదూద్, నిన్న తితలీ
నేడు పెథారు.. ఇప్పుడు సునామీ..
అన్నింటి హెచ్చరిక ఒక్కటే
ప్రకృతిని కాపాడుకోమని
అయినా మనది కపట నిద్రే
మన దాకా వచ్చాక చూద్దాం
అనుకుంటే వచ్చాక చూడ్డానికి
ఏం మిగిలుంటుంది గనుక....
- అట్లూరి వెంకటరమణ
సెల్ : 91772
37945
ఇవి నిజాలు..
కొన్ని నిజాలను పలుకరిద్దాం
మత గురువు మానవుణ్ణి నియంతృత్వంతో
పెంచుతాడు, అందువల్ల అతను చెడిపోయి
సమాజానికి బరువుగా మారుతాడు
రాజకీయవేత్త మనిషిని తన అవసరం కోసం
వాడుకుని వదిలేస్తాడు,
అతను ఎదురు తిరిగి సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుంటాడు
కవి మనిషికి మానసిక బలాన్నిస్తాడు
మామూలు మనిషి మహా మానవుడై సమాజాన్ని ముందుకు నడుపుతాడు,
సాహితీ విశ్వగోళంపై ఎందరో ద్రువతారలు, శిఖరాలు, దిగ్గజాలు నిష్ణాతులు మనముందున్నారు. కవుల సమ్మేళనాలు
సుమధుర పూదోట వనాలు, కవి తన కలాన్ని ఝులిపించి రచనల రసాయనాల ఔషదాలు సృష్టించి సమాజ కుళ్లును కడిగి
మందు రాస్తాడు, మాన్పుతడు
తన కలాన్ని కాగడాగా,
సిరాను చమురుగా మార్చి
అగ్ని వెలిగించి, దుర్మార్గపు సమాజాన్ని ఆహుతి చేస్తాడు
నవ సమాజానికి జీవం పోస్తాడు ఓ నవ కవి
నీ మస్తిష్కాన్ని మధించు,
ఓ మనవతా కవితకు జీవం పోయి
సాహితీ సుగంధ వనంలో మొలకెత్తి
ఓ మహా కవిగా విరాజిల్లు..
ఇది నిజం కాదంటారా? సాహితీవేత్తలారా...
సాహితీ ప్రియులారా.. అభిమానులారా...
- గరిడేపల్లి శోభనాద్రి, ఖమ్మం
సెల్ :88977 85495
సంధ్యా మేఘ శకలాలు..
ఆకాశం సంధ్యాతీరం వైపు సాగింది
మేఘ శకలాలు చెల్లాచెదురుగా పడున్నాయి
చీకటికి రాత్రి రంగులు పూసింది
వెన్నెల లేదు.. వెలుతూరు లేదు
అంతా అయోమయాలు, రాత్రిపగలు
నిత్యసత్య కార్యం చర్చల అరుగు
జీవితమే ప్రయాణం ప్రయాణం
ప్రయాణమే జీవితమైనప్పుడు
మనిషి ఈ కొసనుండి ఆ కొస దాకా
అంతు చూడాలనే తపనతో
దాహాన్వేషణలో సాగేరు జనం విభిన్నం
జనం విశిష్టం, వికృతి, ప్రకృతి జనమే..
బేహారులుగా విహారులుగా,
యాత్రికులుగా, మేథావులుగా
సమూహంగా, ఏకాంతంగా
సాగిపోతూనే ఉన్నారు..
ఖండాంతరాలు దేశాంతరాలు
దాటి సాగిపోతున్నారు
లోక ప్రేమికులు, వ్యక్తి ద్వేషితులు
ఆత్మీయ సరాగాలు నిరతం పక్షుల వలే
పావురాలుగా తరంతరం అధునాతనంగా
సరికొత్త ప్రయాణ వాహనాలతో
పధికులై సాగుతున్నారు...
విశ్వవైక్యులుగా, ఏక కులుంబీకులుగా
రవ తమ గూళ్లల్లో నుంచి
నవ నాగరికులుగా సాగిపోనీ
విశ్వ జీవన వాహినిలో
మానవీయ నిధిగా మిగిలిపోనీ...
- సీహెచ్.ఆంజనేయులు, ఖమ్మం
సెల్ : 79025 37453
సంగీతం... ఆనందం...
నల్లకోక చుట్టుకొని
నేరేడూ కళ్ళతోటి
కొమ్మల్లో కోనల్లో
కూర్చుంటది కోయిలమ్మ
వాసంతం రాగానే
మధురమైన గొంతు తోటి
అందరినీ పలుకరించి
సంతోషం పంచుతుంది
పచ్ఛనైన చెట్టు నుంచి
చల్లగాలి వీస్తుంటే
కోకిలమ్మ సంగీతం
వింటుంటే హాయిదనం
కోపమునూ అలసటనూ
లోలోపలి బాధలన్నీ
మనసు నుండి తొలగించే
సంగీతం ఆనందం.
- షేక్.రేష్మా బేగం, 9వతరగతి.
జెడ్పీహెచ్ఎస్, చెరువు మాధారం
ఈ సమాధుల మధ్యనే..
ఆకాశానికి అల్లుకున్న మహావృక్షపు
కొమ్మలవెంట కాటుక
కుమ్మరించినట్టు చీకటి కురుస్తోంది
గాఢంగా చీకటిని కౌగిలించుకుని
లోకం సుఖాలను కలగంటోంది
తీరం చేరని అలలేవో అలజడిని లోలోపల దిగమించుకున్నట్టు
దు:ఖంతో అలసిన దేహాలు
నిదురనీడల చాటున మౌనంగా
కనులు తూడ్చుకుంటున్నాయి
కార్పొరేట్ కత్తిగాట్లకు
సానబండలైన మొఖాలకు
ఎవరైనా మానవత్వపు
వైపూతలనద్దుతారేమోనని
కనుగుడ్లు తేలిన కపాలాలు
ఎదురుచూస్తున్నాయి
ఎవరు స్పందిస్తారిక్కడీ
ప్రతిఘటించకుండా పీడించటం
ఒక క్రీడగా ఎంచుకున్న
మృగారణ్యం ఇది
చీకటిని ఓ సోమరసంగా తాగి
కామజ్వరంతో వూగిపోతారిక్కడి నాయకగణం
దు:ఖాన్ని మోహనగీతంగా ఆస్వాదించి
కరెన్సీ కట్టలు తలగడగా మగత
మగత నిద్రలో జోగే
భల్లూకాల రాజ్యం ఇంది
ఇక్కడ మనిషికి సంబంధించి
ఏ ఆనవాలూ లేవని పురావస్తు శాఖ
ఏ నాడో తేల్చేసింది
ఎందుకీ దింపుడు కల్లం ఆశ
ఇదిగో ఇక్కడే ఎక్కడో
ఈ సమాధుల మధ్యనే
మనిషితనాన్ని మమ్మీలుగా మార్చి
పురాగా పూడ్చివుంటారు
అధికారం కోసం బొందలో
బొమికలు కొట్లాడుకుంటున్నాయేమో
సమాధులు చిట్లుతున్న శబ్దాలు
ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి
- యనగందుల దేవయ్య
సెల్ : 96660 36288
గతం కాదు ఇది...
గతం కాదు ఇది....
ఒడ్డున పడ్డానని
సంబరపడగానే సరిపోదోయి
నిన్ను రక్షించిన వారిని
మరిచిపోయాఓ
ఈసారి పాతాళానికే నీ దారి
నీ నక్క వినయాలకి
రంకు బొంకు హరి కథలకి నమ్మి
నీకు బిక్ష వెయ్య లా మేం
అయినో నికి ఆకు
కా నో నికి కంచం ఎందుకని
నీపై జాలిపడం
నీకు పట్టం కట్టి
జనహిత కోరే గరిమ కమ్మని
మెరిసిపోయే తళుకులు
మాపై చల్ల మా కు
తెలిసిపోయే జలకు లు
మాకు ఆశ పెట్టమాకు
మా హక్కులు పక్కనబెట్టి
ఊరించి ఊరించి వెనక్కి లాక్కునే నువ్వు
మా ఉక్కు పిడికిలి ఎట్లుంటదో
రుచి చూస్తావా
మళ్లీ నియంతగా మారాఓ
మాలో రగులుతున్న అగ్నిగోళం
నిన్ను శుద్ధిచేసి
మాకు పట్టిన దరిద్రం తగలబెడతాం
నీరు కారుతున్న నిరుద్యోగుల
రెచ్చకొట్టమాకు పొద్దులు పుచ్చ మాకు
సుడిగాలి వేగమై
నిన్ను చుట్టి విసిరిపారేస్తారు
ఇకనైనా కష్టాల విలువ తెలుసుకో
కన్నీటి దారలు తుడవటం నేర్చుకో
అందలమెక్కి మమ్ముల
అణగదొక్కాలని చూడకు
ఆ పప్పులు ఇక ఉడకవు
బెదిరింపులు అది రింపులు
ఇక సాగవు ఖడ్గం లా దూసుకొస్తోం
నిలదీసి ప్రశ్నిస్తాం తరిమేస్తాం
మేం ఎవ్వని బానిస కాదని నిరూపిస్తాం
నెత్తురు గాయాల పచ్చి వాసనలకి
కవచమై నిలుస్తాం
తొలి పొద్దుల గేయాల మై
నవ తెలంగాణ నిర్మించుకుంటాం ......
- సస్య శ్రీ, ఇల్లందు.
సెల్ : 99482 80908
దిగులెందుకు సాహాసిద్దాం...
ఓటమికి భయపడడం
పిరికి వాళ్ల లక్షణం
తలదించకు కామ్రేడ్
తల వంచుట బానిసత్వం
ఎన్నికల హోరు ధనం హోరే
శ్రమజీవుల చెవులకు
నీ బహుజన వామపక్ష
సందేశం చేరడానికి
సమయం తక్కువైన వైనమే
అన్ని జిల్లాల్లోని ఎన్నికల
వాగ్దానాలు రాబోయే కాలంలో
నిక్కచ్చిగా బడుగుజనాలు
చెవులలో చేరవేసే కర్తవ్యం
మనముందున్నదే గదా..
నవ యువకులు చదువు
నేర్చి కుల వివక్షకు గురయ్యే
వాళ్లు మన స్కందావారం
బీఎల్ఎఫ్కు వాళ్లే సంభావ కర్తలు
ముఖ్యమంత్రి వాళ్లే మెండైన కార్యశీలతే
మన కర్తవ్యం కామ్రేడ్స్
- రామిశెట్టి, మధిర
సెల్ : 93902 79127
Authorization