పంచదారను స్వీట్ పాయిజన్ అని వూరికే అనలేదు. దీనివలన బరువు పెరుగుతుంది. షుగర్ వ్యాధి బారిన పడిన వారికి నిషిద్ధమైన పదార్థంగా ఇది ఉంటోంది. దీనివలన మరో దుష్ఫలితం కూడా ఉంది. అతిగా తీపి పదార్థాలు తినడం వల్ల మొహం మీద ముడతలు ఏర్పడి వయసు ఎక్కువగా కనిపిస్తుంది.
కాబట్టి షుగర్ జోలికి పోకుండా ఉంటే 10 ఏండ్ల వయస్సు తగ్గినట్లు కనిపిస్తుందని బ్రిటన్‌కు చెందిన చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ ఫ్రెడరిక్ బ్రాంట్ తెలిపారు. ఈయన దీనిపై 10 మినిట్స్/10 ఇయర్స్ అనే పుస్తకం రాశారు. చక్కెర ఎక్కువ వాడడం వల్ల చర్మపు ప్రోటీన్లు అయిన ఎలాస్టిన్, కొల్లాజన్ పటుత్వం తగ్గిపోయి, ముడతల బారిన పడతారని ఆయన వివరించారు. ఆరోగ్యకరమైన చర్మంపై త్వరగా ముడతలు ఏర్పడవు. అదే తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల త్వరగా చర్మంలో పటుత్వం తగ్గి స్కిన్ వదులవడం, సాగడం జరుగుతుంది. అలాగే షుగర్, ప్రొటీన్, ఫాట్ పదార్థాలను అతి వేడి మీద వండడం వల్ల కూడా చర్మానికి ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే వేపుళ్ళు ప్రమాద కరమని బ్రాంట్ హెచ్చరి స్తున్నారు. బేకింగ్ చేసిన కేక్‌లు వంటివి హాని చేస్తాయని ఆయన చెప్పారు. కాబట్టి పంచదార వాడకంపై కంట్రోలు పెట్టుకోవాలి.
Authorization