హాయ్ ఫ్రెండ్స్! బంతిని విసరవచ్చు, కొట్టవచ్చు, కాలితో తన్నవచ్చు, కిందపడి పైకి ఎగిరేలా బౌన్స్ చేయవచ్చు, ఫుట్‌బాల్, హాకీలలోలా బ్యాట్తోగాని, కాలుతోగాని ముందుకు నెట్టుకుంటూ పోవచ్చు, గోల్ఫ్బాల్ని కొట్టేవిధంగా జాగ్రత్తగా కొట్టవచ్చు, బలం కొద్దీ విసరవచ్చు, పిచర్తో బేస్బాల్లా వదలవచ్చు, తలతో బాల్ని కొట్టవచ్చు, బౌల్చేయవచ్చు, పట్టుకోవచ్చు, గాలిలోకి విసురుతూ పట్టుకుంటూ జగిల్ చెయ్యొచ్చు. ఒక బంతితో మీరు క్రికెట్ ఆడవచ్చు, బాస్కెట్‌బాల్, స్క్వాష్, పోలో, పింగ్‌పాంగ్, గోల్ఫ్, స్నూకర్, ఫూల్ హాకీ, ఫుట్‌బాల్, టెన్నిస్, వాలీబాల్ ఇట్లా బాల్‌తో ఆడే ఏ ఆట అయినా మీరు ఆలోచించవచ్చు.
టెన్నిస్ రాకెట్
అధునికంగా టెన్నిస్ రాకెట్లు గ్రాఫైట్, కార్బన్లతో తయారుచేస్తున్నారు. రాకెట్ తల పరిమాణం రాకెట్ ఫ్రేమ్ పరిమాణం 29 అంగుళాలకు మించదు. వెడల్పు 12.5 అంగుళాలకు మించదు.
పోలో మాల్లెట్
దీనికి 25 సెం.మీ (10 అంగుళాలు) పొడవుగల దృఢమైన కర్ర హెడ్ ఉంటుంది. దీనిని సిగర్ అంటారు. ఇది క్రీడాకారుడి చేతిలో నుండి జారిపోకుండా ఉండేందుకు, చేతిచుట్టూ పట్టివుంచే ఒక బెల్ట్ వంటిది ఉంటుంది.
బేస్‌బాల్ బ్యాట్
అమెరికా మేజర్ లీగ్ బేస్‌బాల్‌లో బ్యాట్, దృఢమైన కర్రతో తయారయ్యి 106 సెం.మీ (42 అంగుళాలు) పొడవును మించకుండా 7 సెం.మీ (2.75 అంగుళాల) వ్యాసం కలిగి ఉంటుంది.
హాకీస్టిక్
ఫ్రీిల్డ్హాకీ స్టిక్ ఆటగాడి పొజిషన్‌ను అనుసరించి ఉంటుంది. డిఫెండర్లు, బాల్‌ను ఆపటం కోసం దళసరిగా ఉండే 'ఝక్' స్టిక్‌లను ఉపయోగిస్తారు.
క్రికెట్ బ్యాట్
క్రికెట్ బ్యాట్‌ను విల్లో వృక్షపు చెక్క(కలప)తో తయారుచేయటం సాంప్రదాయకమై ఉంది. విల్లో (సాలిక్స్ అల్బావర్. సీరులియా)తో తయారైన బ్యాట్‌ను విన్సీడ్ అయిల్‌తో ట్రీట్ చేస్తారు.
Authorization