పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల 3డి ప్రింటర్ ద్వారా కృత్రిమంగా కణజాలాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ పద్ధతిలో ఒక కొత్తరకమైన పదార్థం వేలకొలదీ నీటి తుంపరలను కలిగి, లిపిడ్ ఫిల్మ్ (కొవ్వు ఫిల్మ్‌లు)లో చుట్టబడి ఉండి, శరీరం లోపల ఉండే కొన్ని కణాల పనితీరును నిర్వహిస్తుంది. ఈ ప్రింటెడ్ 'తుంపరల నెట్వర్క్ (ట్రాప్లెట్ నెట్వర్క్)' మందుల పంపిణీలో ఓ కొత్తతరహా సాంకేతిక నిర్మాణానికి పునాదిరాయిలా ఉంటుంది. డ్రాప్లెట్ నెట్‌వర్క్‌లు పూర్తిగా కృత్రిమంగా ఉండి, ఏ జన్యువుకు, ప్రతిరూపం (నకలు)గా లేకుండా ఉంటాయి. పరిశోధనకు దారితీసాయి. ఈ డ్రాప్లెట్లను నరాలను అనుకరించే నెట్వర్క్ ద్వారా మార్గాలు ఏర్పాటు అవడానికి ప్రొటీన్ రంధ్రాలతో ప్రింట్ చేయవచ్చు. ఒక్కో డ్రాప్లెట్ సుమారు 50 మైక్రాన్ల చుట్టుకొలతతో ఒక సజల (ఆక్వియస్)కంపార్ట్మెంట్ అవుతుంది. ఇది జీవించి ఉన్న కణానికి ఐదురెట్లు పెద్దదిగా ఉంటుంది. కొన్ని వారాల పాటు నెట్‌వర్క్‌లు స్థిరంగా ఉంటాయి.