హాయ్ ఫ్రెండ్స్! ఆవిరి యంత్రాన్ని జేమ్స్‌వాట్ కనిపెట్టాడు. ఫలితంగా మానవాళి ఎంతో పురోగమించింది. బొగ్గు వంటి శిలాజ ఇంధనం నుంచి శక్తిని స్వీకరించి నడిపిన తొలి ఆవిరి యంత్రం ఆయనదే. ఈ విధంగా ఇప్పుడు మనం ఉపయోగించుకుంటున్న అనేక యంత్రాల వెనక ఉన్న మహాశక్తి ఆయనే. హెయిర్‌డ్రెస్సర్ నుంచి రోల్స్ రాయిస్, గ్యాస్ టర్బయిన్లవరకు అన్నీ ఆయన ఆలోచనల పరంపరకు చెందినవే. ఆ విశేషాలు తెలుసుకుందాం..
ఆవిరియంత్ర ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవంలోనూ, గ్రేట్బ్రిటన్ సామ్రాజ్యంలోనూ, ప్రపంచంలోనే ఒక పెద్ద మార్పు సంభవించింది. వీటి ద్వారానే 18 శతాబ్దంలో యాంత్రిక యుగం అభివృద్ధి చెందింది. నీటి ఆవిరితో నడిచే రైలు, ఓడలు కూడా తయారయ్యాయి. నీటిని మరిగించడానికి బొగ్గును ఇంధనంగా ఉపయోగించేవారు. ఇలాంటి స్టీమ్‌తో నడిచే ఓడని స్టీమర్ అనడం తెలుగు భాషలోకి వచ్చింది. ఆవిరి యంత్రం వేడి నీటి నుండి వెలువడే ఆవిరిని ఉపయోగించుకొని పనిచేస్తుంది. వేడి నీటి నుండి వెలువడే ఆవిరిని శక్తిగా మార్చి యంత్రాన్ని కదిలించగలిగేలా చేసి ఫ్యాక్టరీ పనులకు లేదా రైలు లేదా పడవలను కదలించేందుకు ఉపయోగిస్తున్నారు. 18 వ శతాబ్దపు తొలినాళ్లలో ఆవిరి యంత్రాలను గనుల పంపులలో ఉపయోగించడం ప్రారంభమైంది, 1770 లో జేమ్స్ వాట్ ద్వారా బాగా అభివృద్ధి చెందాయి. యంత్రాలు పనిచేయడానికి గుర్రాలు, గాలిమరలు, వాటర్ మిల్లుల స్థానంలో ఆవిరి యంత్రాలను ఉంచారు, ఇవి ప్రవేశపెట్టిన ఈ సమయం పారిశ్రామిక విప్లవానికి చాలా ముఖ్యమైనది. మొదటి ఆవిరి యంత్రాలు పిస్టన్ యంత్రాలు. ఆవిరి పీడనం ఒక పిస్టన్ మీద ఒత్తిడి కలుగజేసినపుడు పిస్టన్‌తో పాటు ఉన్న సిలిండర్ కదులుతుంది, ఈ విధంగా ఇది రెసిప్రోకల్ (ముందుకు, వెనకకు) కదలికలను కలిగి ఉంటుంది. ఈ కదలిక పంపును నేరుగా కదిలిస్తుంది లేదా క్రాంక్ (వృత్తాకార చలనం కలిగించు వంగిన ఇరుసు) ని పనిచేయించటం ద్వారా అది చక్రాన్ని తిప్పుతుంది, యంత్రాన్ని పనిచేయిస్తుంది. ఆవిరి యంత్రాలు, యంత్రాలను పని చేయించేందుకు, గనులలోని పంపులు కదలించడానికి కర్మాగారాల్లో ఉపయోగించారు. తరువాత రైల్వే వాహనాలు, ఆవిరి పడవలు (స్టీమ్బోట్లు) తరలించడానికి చిన్న ఇంజన్లు తయారుచేసారు. ఆవిరి యంత్రానికి శక్తినిచ్చే నీటి ఆవిరి ఒక బాయిలర్‌లో తయారవుతుంది.బాయిలర్‌లో ఉన్న నీటిని వేడి చేయడం ద్వారా ఆ ఆవిరి తయారవుతుంది. చాలా చోట్ల అగ్నితో బాయిలర్ వేడిచేస్తారు. అగ్ని కోసం ఇంధనాలుగా కలప, బొగ్గు, లేదా పెట్రోలియం ఉపయోగించవచ్చు. అగ్నికి బదులుగా అణుశక్తి లేదా సౌరశక్తిని ఉపయోగించవచ్చు. బాయిలర్ నుంచి నీటి ఆవిరి బయటికి వచ్చేటప్పుడు ఒక పిస్టన్ పై బలాన్ని ప్రయోగిస్తుంది. తద్వారా ఆ పిస్టన్ ఒక వైపుకు కదులుతుంది. బయటికి వెళ్ళుతున్న నీటి ఆవిరిని ఒక కవాటం పిస్టన్ చివరికి వెళ్ళేలా చేస్తుంది. ఆ ఆవిరి మళ్ళీ పిస్టన్ వెనుకకు మళ్ళేలా బలాన్ని ప్రయోగిస్తుంది. దీనితో పిస్టన్, నీటి ఆవిరి యధాస్థానానికి వస్తాయి, ఈ విధంగా నీటి ఆవిరిని కవాటాల అదుపుతో పదేపదే పిస్టన్ ముందుకు వెనుకకు కదిలేలా ఈ ఆవిరి యంత్రాలను రూపొందిస్తారు. ఈ విధమైన పిస్టన్ కదలికలను ఉపయోగించి చక్రాలు తిరిగేలా చేస్తారు లేదా ఇతర యంత్రాలను నడిపిస్తారు. నీటి ఆవిరి మీద మన ఇండ్లలో ప్రెషర్ కుక్కర్‌తో వంటచేసుకుంటాము.
Authorization