నేరేడు ఒక పెద్ద వృక్షం. దీనిని పండ్ల కోసం పెంచుతారు. ఈ చెట్టుకు వేగంగా పెరిగే గుణం ఉంటుంది.
దాదాపు 30 మీటర్లు ఎత్తు పెరిగే అవకాశం ఉంది. నేరేడు చెట్లు వంద ఏళ్ళకు పైగా జీవించగలవు సంపూర్ణ ఆరోగ్యం కోసం..ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని..అనారోగ్యాల నివారిణి. నేరేడు శక్తినందించి. ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు..కొన్ని రకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు..ఆకులు..బెరడు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లు వగరు వగరుగా ఉండి తీయగా ఉంటాయి. నేరేడు కలపను వ్యవసాయ పనిముట్లు, దూలాలు తయారుచేయుటకు వాడతారు. నేరేడు రసాన్ని, నిమ్మరసంతో కలిపి తీసుకొంటే మైగ్రేన్‌కు పరిష్కారం లభిస్తుంది. నేరేడు పళ్ళను తీసుకొనే వారిలో పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి. గాయాలు త్వరగా మానిపోతాయి. దీనికి రక్తాన్ని శుద్ధి చేస్తే శక్తి కూడా ఉంది. నేరేడు పండ్లలో రకాలున్నాయి. గుండ్రంగా పెద్దగా ఉండేది ఒక రకం. కోలగా ఉండి పెద్దగా ఉండే వీటిని అల్ల నేరేడు అని అంటారు. కొన్ని గుండ్రంగా ఉండి చిన్నవిగా ఉంటాయి. వీటి చిట్టి నేరేడు అని అంటారు.
Authorization