బావి లోని నీరును తోడడానికి చేదను ఉపయోగిస్తారు. చేదతో నీరును సురక్షితంగా, సులభంగా తోడేందుకు ఉపయోగపడే పరికరాన్ని గిలక అంటారు. గిలకతో నీరు సులభంగా తోడడమే కాకుండా తొందరగా పని జరుగుతుంది. నేడు నీటిని తోడేందుకు మోటార్లు ఉపయోగిస్తున్నందువల్ల బోరు బావుల గిలక వాడకం తక్కువయింది. గిలక సులభంగా తిరగడానికి, శబ్దం రాకుండా ఉండడానికి గిలక ఇరుసు భాగంలో కందెన లేదా నూనెను కొద్దిగా పూయాలి. నీరును తోడేందుకు ఉపయోగించే తాడుకు మధ్యలో ముడులు లేకుండా ఉంటే మంచిది. ముడులు ఉండుట వలన సమయం వ థా అవడమే కాకుండా కష్టం కూడా. అంతేకాకుండా ముడుల వద్ద చేదను లాగేటప్పుడు తాడు తెగిపోవడం లేదా గిలక మీద నుంచి తాడు పక్కకి పడిపోవడం లేదా గిలకలో ఇరుక్కోవడం జరుగుతుంది. గిలక మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా మధ్యస్తంగా ఉంటే పని తొందరగా పూర్తవడమే కాకుండా సులభంగా ఉంటుంది. గిలక ఒక వైపు వాలినట్టు ఉండక సమంగా ఉండుటంతో తాడు జారిపోకుండా ఉంటుంది. చేదను బావిలో వేసినప్పుడు బావి మొత్తలు చేదకు తగలకుండా నీటితో నిండిన చేదను పైకి లాగినపుడు సులభంగా అందుకునే విధంగా గిలకను ఏర్పాటు చేయాలి. బావికి ఉన్న గట్టు, గట్టు మీది దిమ్మెలు, దిమ్మెపై అమర్చిన దూలం, దూలానికి అమర్చిన గిలక మొత్తం పటిష్ఠంగా ఉంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.
Authorization