భూమ్మీద ఉన్న జీవులకు మూలాధారం వైరస్లు అనడంలో ఆశ్చర్యం లేదు. వైరస్లకు డీఎన్ఏ, ఆర్ఎన్ఏలు మాత్రమే ఉంటాయి. ఇవి కణ రూపంలో ఉన్నా తమంతట తాము జీవికి ఉన్న లక్షణాన్ని ప్రదర్శించుకోలేవు. కానీ వేలాది రూపాలు, అంతర్గత జన్యుస్మృతి ఉన్న వైరస్లు ఒంటరిగా ఉన్నప్పుడు సాధారణ నిర్జీవ పదార్థపు రేణువుల్లా, స్ఫటికల్లాగే ఉంటాయి. అయితే ఇవి జీవకణాలున్న బాక్టీరియాలు, జంతువులు, వృక్షాలు, పురుగులు... వంటి వాటిలోకి ప్రవేశిస్తే ఇక వాటి ఉద్ధృతికి అడ్డూ అదుపూ ఉండదు. ఉదాహరణకు ఇవి మన జీవ కణంలోకి వెళ్లాయనుకోండి... వెంటనే ఆ కణంలో ఉన్న జన్యు స్మృతికి బదులు, తన జన్యుస్మృతికి అనుగుణంగా కణ విభజన జరిగేలా చేస్తుంది. అంటే మన జీవ కణాలే వైరస్ కణాల్ని ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా మారతాయి. అలాంటి కణాలు మన శరీరానికి పొసగవు. కాబట్టి వాటి మీద దాడి చేయడానికి తెల్ల రక్తకణాలు సిద్ధపడతాయి. ఆ క్రమంలో మనకు జ్వరం, జలుబు వంటివి వస్తాయి. ఈ జ్వరాన్నే వైరల్ ఫీవర్ అంటారు.