హాయ్ చిన్నారులూ! ప్రపంచంలోనే అతిపెద్ద టెర్మినల్‌ను చైనాలో నిర్మించారు. నేలపైనే ఉండే ఈ విమానాశ్రయ నమూనాను ఇటీవలే విడుదల చేశారు. 2015వ సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించిన విమానాశ్రయం ఈ సంవత్సరం అంటే 2018 లో ప్రారంభం కాబోతున్నది. ఆ విమానాశ్రయ విశేషాలు తెలుసుకుందాం. ప్రపంచంలో రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో చైనాలోని 'బీజింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు' రెండోది.
మనిషి పక్షుల్ని చూసి వాటిలా స్వేచ్ఛగా ఎగరాలనుకున్నాడు. అలాంటి ఆలోచనే వచ్చిన రైట్ బ్రదర్స్ విమానానికి రూపకల్పన చేశారు. ఆ నాటి నుంచి నేటి వరకు ఎన్నో రకరకాల విమానాలను మానవులు అభివృద్ధి చేశారు. వాటిలోనే ఆఫీసు కార్యాలయం, స్నానపు గది, వంట గది, బెడ్ రూం ఇలా సకల హంగులు అందులోనే.. మరి విమానాలను నిలిపి ఉంచే విమానాశ్రయం కూడా ఆకర్షణీయంగా ఉండాలి కదా.. ఎయిర్పోర్ట్ డెవలపర్స్-ఏడీపీఐ (ఎయిర్పోర్ట్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్), జాహ హదిద్ ఆర్కిటెక్స్ (జెడ్‌హెచ్‌ఏ) సంస్థతో కలిసి ఈ విమానాశ్రయ టెర్మినల్-1 నమూనాను సంయుక్తంగా డిజైన్ చేశాయి. విమానాశ్రయ ప్లాన్ ఎలా ఉండాలి? దానికి ఎంత ఖర్చు అవుతుంది? విమానాశ్రయంలో ఎలాంటి సదుపాయలు ఉండాలి వంటివన్నీ ఏడీపీఐ చూసుకుంటుంది. ఇందులో నిష్ణాతులైన ఇంజనీర్స్, ఆర్కిటెక్చర్స్ ఉంటారు. బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ టెర్మినల్‌ను కడుతున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద టెర్మినల్‌గా రూపుదిద్దుకుంటున్న దీని పేరు 'డాగ్జింగ్'.
టెర్మినల్ దాదాపు 172 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. బ్రిటన్‌లో అతిపెద్ద టెర్మినల్ అయిన 'లండన్ హెత్రో టెర్మినల్-5' కంటే ఇది రెట్టింపు. హెత్రో టెర్మినల్-5, కేవలం 87 ఎకరాల్లోనే విస్తరించి ఉంది. ఒక సంవత్సరానికి నాలుగు కోట్ల ప్రయాణీకులకు సేవలందించే విధంగా ఈ టెర్మినల్‌లో మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నారు. టెర్మినల్‌కు ఆరు మార్గాలున్నాయి. ఆ ఆరు మార్గాలను అనుసంధానిస్తూ ఒక పెద్ద హాల్‌ను నిర్మిస్తున్నారు. అందరి మన్ననలు అందుకునేలా ఈ హాల్‌ను తీర్చిదిద్దుతున్నారు. చైనీయుల సంస్కృతిని ప్రతిబింబించేలా దీన్ని నిర్మించారు. ప్రపంచంలోనే అతి రద్దీ గల విమానాశ్రయం- అక్లాండ్‌లోని 'హర్ట్స్ ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్'. సంవత్సరానికి దాదాపు 10 కోట్ల మంది ప్రయాణీకులు ఈ ఎయిర్‌పోర్టుకు వస్తున్నారు. లండన్‌లోని హెత్రో విమానాశ్రయం మూడో అతి రద్దీ గల విమానాశ్రయం ఢిల్లీ విమానాశ్రయం 26వ స్థానంలో, ముంబై 29వ స్థానంలో ఉన్నాయి.
Authorization