ప్రపంచంలోనే ఎత్తయిన భవంతి దుబారులోని బూర్జ్ ఖలీఫా. దీని గురించి ఎందుకు చెబుతున్నానంటే ఈ మధ్య ఓ పార్కులో బూర్జ్ ఖలీఫా లెగో ఆకాశహర్మ్యం నమూనాని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కట్టిన వాటిల్లో ఇదే అతి ఎత్తయిన లెగో భవంతిగా రికార్డు కొట్టింది. 163 అంతస్తులుండే నిజమైన బూర్జ్ ఖలీఫా ఆకారంలోనే ఆకట్టుకునేలా నిర్మించిన ఈ లెగో కట్టడం 17 మీటర్ల ఎత్తు ఉంది. దాదాపు 55 అడుగులన్నమాట. అంటే అయిదు అంతస్తుల భవంతి. ఇంతకీ ఎక్కడ నిర్మించారో చెప్పలేదు కదూ. త్వరలో దుబారులో ప్రారంభం కాబోతున్న లెగోల్యాండ్ అనే ఓ అమ్యూజ్మెంట్ పార్కులో. దాదాపు ఆరు కోట్ల లెగో బ్రిక్స్ ఉపయోగించి 15 వేల లెగో నమూనా ఆకారాలతో ఈ లెగోల్యాండ్ను తీర్చిదిద్దుతున్నారు. వీటన్నింటిలో ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ ఈ బూర్జ్ఖలీఫా లెగో భవంతే.దీని తయారీకి ఐదు వేల గంటలు పనిచేశారు. 4,39,000 లెగో ఇటుకల్ని ఉపయోగించారు. ఈ లెగో నమూనా బరువు వెయ్యి కిలోలు. మిరుమిట్లుగొలిపే ఎల్ఈడీ విద్యుద్దీపాలతో అసలైన బూర్జ్ ఖలీఫాలా కనువిందు చేస్తున్నది. ఈ మధ్యే డెన్మార్క్‌లో ఓ నౌకా నిర్మాణ సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద లెగో నౌక నమూనాన్ని తయారు చేసింది. దాదాపు 12 మీటర్ల పొడవున్న ఈ నౌక 2,860 కిలోల బరువుంది. లండన్‌లో ల్యాండ్ రోవర్ కంపెనీ లెగో ఇటుకలతో 13 మీటర్ల లండన్ బ్రిడ్జ్ ఆకారాన్ని తయారు చేసింది. 5,805,846 లెగో ఇటుకలతో అత్యధికంగా లెగో బ్రిక్స్‌తో చేసిన నమూనాగా ఈమధ్యే ఇది గిన్నిస్ రికార్డు కొట్టింది.
Authorization