ప్రకతి ప్రసాదించే ప్రతి పండూ ఆరోగ్యాన్ని ఇచ్చినా కొన్ని పండ్లను చూస్తే ఇట్టే నోరూరుతుంది. వాటిల్లో ఎర్రగా కనిపిస్తూ కంటికి ఇంపుగా ఉండే దానిమ్మ ఒకటి. అన్ని కాలాల్లోనూ దొరికే పండు ఇది. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు దానిమ్మలో అనేకం ఉన్నాయి. ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులు అనే తేడాలేకుండా అందరూ నిస్సంకోచంగా దానిమ్మ గింజలు తినొచ్చు. దానిమ్మ గింజలు శరీరానికి మంచి ఔషధంలా పనిచేస్తాయని అందరికీ తెలిసిందే. ఇందులో ఎ, సి, ఇ వంటి విటమిన్లే కాకుండా ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. వద్ధాప్యాన్ని సైతం దూరం చేస్తాయి. అల్జీమర్స్, బ్రెస్ట్, స్కిన్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తాయి. రోజూ దానిమ్మ తినడం వల్ల ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. దానిమ్మ ి జీర్ణక్రియను మెరుగు పరచడంలో దానిమ్మ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే దానిమ్మ గింజల్లోనే కాకుండా దాని తొక్కలోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.