ఆ నదిని చూడగానే ఎంతో అందంగా కనిపిస్తుంది. వెంటనే వెళ్లి ఆడుకోవాలనిపిస్తుంది.. కానీ దగ్గరికి వెళ్లామా.. ఇక అంతే సంగతులు.. శిలగా మారిపోవాల్సిందే.. నమ్మలేకపోతున్నారా..? కానీ ఇది నిజం ఫ్రెండ్స్. ఆ వింత ఏంటో తెలుసుకోవాలనుందా.. పదండి మరి టాంజానియాకు...
ముచ్చటగొలిపే లేత గులాబి వర్ణంలో ఉండే ఆ నది పేరుకి మాత్రమే నది. మాములుగానే నీరు చూడగానే మనం వెంటనే దిగుతాము. కానీ ఈ నది ఎంతో అందమైన మత్యువును ఇచ్చే నది మరి. అదే లేక్ నట్రాన్ నది.
లేక్ నట్రాన్ నది ఆఫ్రికాలోని టాంజానియాలో ఉంది. ఈ నదిలోని నీటిని తాకినా లేదా తాకినా ఏ జీవులైన వెంటనే శిలలుగా మారిపోతాయి. ఎందుకంటే ఈ నది కింద ఉన్న లావానే దీనికి కారణం.
ఈ నదిపై ఏదైనా పక్షి వెళ్ళిన లేక నీటిని తాగడానికి వచ్చినా వెంటనే ఆ జీవి శిలగా మారిపోతుంది.
ఈ నది ఎందుకు అందరిని శిలలుగా మారుస్తుంది అంటే అక్కడి ప్రజలు ఓ కథను చెబుతున్నారు. ఆ ప్రదేశంలో మంత్రగత్తె ఉండేదనీ.. ఆమెనే అందరిని ఇలా శిలలుగా మారుస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.
కానీ అక్కడ పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు లేక్ నట్రాన్ నది కింద భారీ అగ్నిపర్వతం ఉన్నట్టు తేల్చారు. అది బద్దలై లావా నీటిలో కలవడం వల్ల సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ల ప్రభావం వల్ల ఈ నది లో ఏ జీవి అయిన అడుగుపెట్టినా వెంటనే శిలగా మారిపోతున్నాయి.
ఈవిధంగా విడుదలయిన ఈ రసాయనాన్ని గతంలో ఈజిప్ట్‌లో మమ్మీలను తయారు చెయ్యడానికి వాడేవారట. ఈ నది ఎప్పుడూ కుడా సుమారు 145 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది.
Authorization