రెండో ప్రపంచ యుద్ధసమయంలో కొన్ని వాహనాలు అవసరమయ్యాయి. అందుకని ఎగుడుదిగుడు గుట్టల మీదా, అడవుల్లో సైతం ప్రయాణం చేయగల ఇలాంటి వాహనాలను 'విల్స్-ఓవర్ల్యాండ్' అనే కంపెనీ తయారుచేసింది. జి.పి (జనరల్ పర్పస్) అనే అక్షరాలే జీప్గా మారాయని ఒక వాదన. పపారు చిత్రకథలోని 'యూగున్ ద జీప్' అనే పాత్ర పేరే దీనికి పెట్టారని మరికొందరు చెబుతారు.