కావలసిన వస్తువులు ప్లాస్టిక్ స్పూన్లు, ఇయర్ బడ్స్, కుందన్లు, కార్డుబోర్డు, జిగురు, కత్తెర, రంగులు, బ్రష్ ఎలా చేయాలంటే.. మొదటగా కార్డు బోర్డును తీసుకుని, దాన్ని వలయాకారం లో కత్తిరించుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ స్పూన్లను నెమలి పురి ఆకారంలో... ఆ వత్తాకారం చుట్టూరా అమర్చాలి. వాటికి నెమలి పురికి సరిపోలే రంగులు వేయాలి. కార్డుబోర్డుపై నెమలి శరీర ఆకతి బొమ్మ వేసి, దాన్ని కత్తిరించుకోవాలి. దీన్ని ఆ వత్తాకారం మధ్యలో అమర్చుకోవాలి. ఇప్పుడు ఇయర్‌బడ్స్‌కు రెండు వైపులా నీలం రంగు వేసుకోవాలి. వాటిని ఇరువైపుల కట్ చేయాలి. కట్ చేసిన ఇయర్‌బడ్స్‌ను కార్డుబోర్డుతో తయారుచేసుకున్న నెమలి శరీరంపై క్రమపద్ధతిలో అతికిస్తే అందంగా ఉంటుంది. వాటినే తలపై ఫించంలా కూడా పెట్టుకోవాలి. కళ్ల కోసం కుందన్లను ఉపయోగించుకోవచ్చు. అంతే అందమైన నెమలి రెడీ..