బ్రిటిష్ వారి ప్రభావంతో మనం తెలుగు వారాలకంటే ఇంగ్లీష్ వారాల పేర్లే ఎక్కువగా వాడుతాం. ఇంగ్లీష్ వారాలు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందికి తెలుసు. కానీ ఆ వారాలకి ఆ పేర్లు ఎలా వచ్చాయో మాత్రం చాలా మందికి తెలియదు. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. పురాతన కాలంలో బాబిలోనియన్స్, ఆ తర్వాత రోమన్లు అంతరిక్షంలోని గ్రహాలు మొదలైన వాటికి గుర్తుగా ఈ వారాలకు వాళ్లు పేర్లు పెట్టారని తెలుస్తోంది. మండే అంటే మూన్స్ డే. అంటే చంద్రుని గుర్తుగా ఈ పేరు పెట్టారు. ట్యూజ్ డే టియూస్ డే. రోమన్లు మార్స్్ని తమ యుద్ధ దేవుడిగా పూజించేవారు. అయితే మార్స్్ని యుద్ధ వీరుడు 'టియూ'గా స్కాండినేవియన్లు ఆరాధించేవారు. దానికి గుర్తుగా ఈ వారానికి ఆ పేరు వచ్చింది. వెన్స్డే అంటే ఓడెన్స్ డే. రోమన్ల దేవుడైన మెర్క్యూరీని స్కాండినేవియన్లు ఓడెన్ దేవుడిగా పిలిచేవారు. అందుకే ఆ పేరు వచ్చింది. థర్స్ డే అంటే థోర్సుడే. థోరు అంటే ఉరుముల దేవుడు. ఫ్రైడే అంటే ఫ్రేజాయిస్ డే. వీనస్ లాగానే ఫ్రేజాస్ కూడా ప్రేమకు దేవత. సాటర్డే అంటే సాటర్న్ డే. సాటర్న్ అంటే శని గ్రహం. సన్డే అంటే సూర్యుని రోజు. సూర్యుడికి గుర్తుగా సన్డేకి గుర్తుగా ఆ పేరు పెట్టారు.
Authorization