ప్రపంచంలోనే అతి చిన్న జెల్లీ ఇరుకండ్జి జెల్లీఫిష్. దీని విషసామర్థ్యం ఎంతంటే వెయ్యి సాలీడుల్ని, వంద నాగుపాముల్ని చంపగలిగేటంత. పరిమాణం చూస్తే ఒక ఘనపు సెంట ీమీటరంతే. 1964లో క్వీన్స్‌లాండ్‌లో దీన్ని గుర్తించారు. మనుషులకైతే దీని విషప్రభావం వల్ల వాంతులు, కాళ్లు-చేతుల తిమ్మిర్లు, తలనొప్పి, వికారం, ఒళ్లంతా మంట, గుండె కొట్టుకునే వేగం పెరిగి చెమటలు పట్టేయడం, ముఖం-చర్మం వాపు వంటివి సంభవిస్తాయి. తక్షణమే వైద్యం అందకపోతే ప్రమాదమే. ఒకోసారి ప్రాణాంతకం కూడా. ఇరుకండ్జి వెచ్చటి నీటిని ఇష్టపడుతాయి. ఆస్ట్రేలియా సముద్ర తీరప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. వీటిలో కారుకియా బార్నేసి, మాలోకింగీ, అలాటినా అలాటా, మాలోమాక్సియా అనే నాలుగు రకాలుంటాయి.