తలనుండు విషము ఫణికిని వెలయంగ దోకనుండు వృశ్చికమునకున్ తలతోక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! భావం: పాముకు విషం నోటిలో ఉన్న కోరల్లో ఉంటుంది. తేలుకు తోక చివర ఉంటుంది. కానీ దుర్మార్గునికి శరీరం అంతా విషం వ్యాపించి ఉంటుంది. అందుకని దుర్మార్గుడితో చాలా జాగ్రత్తగా ఉ ండాలి.