ఈ పీత చేష్టలు మరీ వింతగా ఉంటాయి. దాని ముందరుండే చేతుల్లాంటి కాళ్లని చూడండి. వాటికి తెల్లటి బాక్సింగ్ గ్లౌస్లా ఉన్నాయా! అవే శత్రువుల నుంచి వాటికి రక్షణనిచ్చేవి. ఒకరకంగా చెప్పాలంటే దానికవి వేళ్లలా పనిచేస్తాయి. ఆహారాన్ని సేకరించడానికి, శత్రువు ఎదురైనప్పుడు తన చేతి పంజాలు విప్పి బాక్సింగ్ చేస్తున్నట్టు బెదిరిస్తుంది. హవాయి, ఇండోనేషియా సముద్రాల్లో ఎక్కువగా ఉండే ఈ పీతల పొడవు అంగుళమంత కూడా ఉండదు.