విలియం కాక్స్టన్ ఇంగ్లండ్‌లో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్‌ని స్థాపించిన వ్యక్తి. కాక్స్టన్ ఎప్పుడు పుట్టాడో కచ్చితంగా తెలియదు కానీ 1422 ప్రాంతంలో పుట్టి ఉండవచ్చని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఆయన జన్మస్థలం ఇంగ్లండ్ దేశంలోని 'కెంట'. కాక్స్టన్ 16 సంవత్సరాల వయసులో లండన్ వెళ్లి ఒక వ్యాపారి దగ్గర అప్రెంటిస్‌గా పనిచేశాడు. ఆ తర్వాత బెల్జియమ్ దేశంలో ఊలు వ్యాపార కేంద్రమైన బ్రుజెస్ ప్రాంతానికి వెళ్లి అక్కడి వ్యాపార వర్గాల్లో ముఖ్య సభ్యుడయ్యాడు. 1462-1470 వరకు 'ఇంగ్లిష్ నేషన్ ఆఫ్ మర్చంట్ అడ్వెంచర్స్'కి గవర్నర్‌గా పనిచేశాడు. దీనిద్వారా రాజుతో సంప్రదింపులు జరిగేటపుడు తోటి వర్తకులందరి ప్రతినిధిగా వ్యవహరించేవాడు. 1470లో జర్మనీలోని కలోన్ నగరానికి వెళ్లి ప్రింటింగ్ పనిని నేర్చుకున్నారు. 1476లో లండన్‌కి తిరిగి వచ్చి 'వెస్ట్ మినిస్టర్' ప్రాంతంలో ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పాడు. పుస్తకాలు ముద్రించడంలో మంచి పేరు సంపాదించాడు. ఇంగ్లీష్ భాషలో మొదట ముద్రించిన ''ద రిక్యుయెల్ ఆఫ్ ద హిస్టరీస్ ఆఫ్ ట్రారు'' పుస్తకాన్ని ఫ్రెంచ్ నుంచి ఇంగ్లీష్‌లోకి అనువాదం చేశాడు. చాసర్ రాసిన 'క్యాంటర్బరీ టేల్స్' పుస్తకాన్ని మొదట ముద్రించింది కాక్స్టనే. అలా ఆయన మరణించే నాటికి వందరకాల వరకు పుస్తకాలు ప్రచరించారు.
Authorization