గాలి మర విద్యుత్‌ను తయారుచేసే యంత్రం. దీన్నే ఆంగ్లంలో విండ్ మిల్, విండ్ టర్బైన్ అనీ అంటారు. కొద్దిపాటి గాలి వీచినా దీని రెక్కలు తిరిగేలా రూపొందిస్తారు. అలా రెక్కలు తిరిగినప్పుడు వాటి వెనకభాగంలో అమర్చి ఉన్న జనరేటర్ దానికదే తిరుగుతుంది. అలా తిరగడం వల్ల ఆ వేగానికి విద్యుత్ పుడుతుంది. అలా పుట్టిన విద్యుత్‌ను ఒక బ్యాటరీలోకి ఎక్కించి నిల్వ చేస్తారు.