హాయ్ చిన్నారులూ... ! స్కూల్ నుండి రాగానే మీరేం చేస్తారు. హోం వర్క్ చేస్తారు.. అది అయిపోతే బొమ్మలతో ఆడుకుంటారు కదూ.. మరి ఓ ఏడేళ్ల బుడతడు మాత్రం ఆ బొమ్మల ఆటతోనే ఏకంగా కోట్లు సంపాదించేస్తున్నాడు. ఎలా అంటారా..? అయితే ఇది చదివేయండి.
- ఈ బుడతడి పేరు రేయాన్. ఉండేది అమెరికాలో. వయసు ఏడేండ్లు. కానీ అతడి సంపాదన వింటే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. యూట్యూబ్ స్టార్స్ అందరి కంటే అత్యధికంగా సంపాదిస్తూ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచాడు ఈ ర్యాన్.
- ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న యూట్యూట్ స్టార్స్ 2018కి చెందిన పది మందితో కూడిన జాబితాను అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఈ మధ్యనే ప్రకటించింది. ఇందులో సుమారు రూ.154కోట్ల వార్షిక ఆదాయంతో ఏడేళ్ల ర్యాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. గతేడాది ఇదే జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్న అతను ఇప్పుడు అందరినీ వెనక్కి నెట్టేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
- ర్యాన్‌కు యూట్యూబ్‌లో 'ర్యాన్ టార్సు రివ్యూ' పేరిట ఛానల్ ఉంది. ఇంతకీ అతడి పనేంటి అనుకుంటున్నారా? బొమ్మలతో ఆడుకోవడమే. కొత్త కొత్త బొమ్మలతో ఆడుకుంటూ... అవి ఎలా ఉన్నాయి.. ఎలా పనిచేస్తాయి... వంటి విషయాలను తన ముద్దు ముద్దు మాటలతో చెబుతూ దానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడమే.
- 2015 నుంచి ఇలా అప్లోడ్ చేయడం ప్రారంభించాడు ర్యాన్. ఆ వీడియోలను లక్షల మంది వీక్షకులు చూస్తున్నారు. దీంతో ర్యాన్‌కు కోట్ల రూపాయల డబ్బు వచ్చిపడుతోంది. అలా ఛానల్ ద్వారా 2018 ఏడాదిలో రేయాన్ 22 మిలియన్ డాలర్లు సంపాదించాడు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.154.84కోట్లు. గతేడాదితో పోల్చుకుంటే అతడి వార్షిక ఆదాయం ఈ ఏడాది రెట్టింపు అయ్యింది.
- ర్యాన్ యూట్యూబ్ చానల్‌కు 1,72,98,646 మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఓ వీడియోను ఏకంగా 93 లక్షలకు పైగా మ ంది వీక్షించారంటే ఈ బుడతడి ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు.
Authorization