హాయ్ ఫ్రెండ్స్... చలి వణికిస్తున్నా ఐస్‌క్రీమ్ గుర్తొస్తే మాత్రం నోరూరిపోతుంది. ఎంత తిన్నా ఇంకా కావాలనిపిస్తుంది. జలుబు చేస్తుందని అమ్మకోప్పడినా.....
ఈ ఒక్కసారికే అని లాగించేస్తాం. మరి... అంత ఇష్టమైన ఐస్‌క్రీమ్‌కు బోలెడంత చరిత్ర ఉంది. అదేంటో తెలుసుకుందామా..
నాలుగు వేల ఏళ్ల క్రితం ఒక చైనా చక్రవర్తి ఇంట్లో ఒక వంటవాడు ఉండేవాడు. అతను పండ్ల నుంచిరసాన్ని, గుజ్జును తీసి దాంట్లోఐస్ ముక్కల్ని కలిపి చక్రవర్తికి ఇచ్చాడట. అప్పటి నుంచి దాన్నిక ఎవ్వరూ వదిలిపెట్టలేకపోయారు.
ఇటలీలో 13వ శతాబ్దపు రోజులు. 'మార్కోపోలో' అప్పటి నావికుల్లో ఒకరు. ఆయన అన్ని దేశాలు చుట్టి, ఇటలీకి తిరిగి వచ్చేటప్పుడు ఎన్నో విలువైన వస్తువులు తెచ్చుకున్నాడు. వాటితో పాటు అప్పటికే ఆసియా దేశాలను నోరూరిస్తున్న మిల్క్ ఐస్ చేసే పద్ధతులు తెలుసుకుని వచ్చాడట. దాన్ని తయారుచేసి జెలాటో ఐస్ అని పేరు కూడా పెట్టాడు. దాంతో ఆ దేశంలో కూడా భాగ్యవంతుల ఆహారంగా అయిందీ.. ఐస్‌క్రీమ్
కోన్ ఐస్ క్రీమ్
1904లో అమెరికాలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతోంది. అక్కడ ఐస్‌క్రీమ్ అమ్ముకునే బండి ఆయన దగ్గర కప్పులు అయిపోయాయి. ఇంకేం చేస్తాడు పాపం.. ఇంటికి వెళ్లిపోదామనుకున్నాడు. పిల్లలూరుకుంటారా! ఐస్కావాలని గొడవచేశారు. దాంతో ఆ పెద్దమనిషికి పక్కదుకాణంలో ఉన్న రొట్టెలే శరణ్యం అయ్యాయి. వాటిని తెచ్చి చుట్టచుట్టి మధ్యలోఐస్క్రీమ్ పోసి చక్కగా అమ్మేశాడట. అది చూసిన మరొక పెద్ద మనిషి కోన్ తయారీ మొదలు పెట్టారు.
కప్ ఐస్‌క్రీమ్
1620లో ఫ్రాన్స్‌కు చెందిన 'గెరాల్డ్ టిసైన్' ఐస్‌క్రీమ్‌కి ఓ రూపాన్నిచ్చాడు. మొదటి ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీ ఆలోచన వచ్చింది 1852లో. 'జాకబ్ ఫస్సెల్' ఓ పాల వ్యాపారి. అతని వ్యాపారంలో పాలు, వేరు చేసిన మీగడ మిగిలిపోయేవి. వాటిని వృథాచెయ్యకూడదు అని అతను అనుకున్నాడు. అంతే ఐస్‌క్రీమ్‌లా తయారుచేసి కప్పుల్లోనింపి అమ్మేవాడు. వాటికి చాలా గిరాకీ ఉండేది. అందువల్లే కప్ ఐస్ పరిశ్రమకు పునాది వేసింది ఈయనేనని ఒప్పుకుని తీరాల్సిందే.
పుల్ల ఐస్
పుల్లైసు ఇష్టంలేని పిల్లలుంటారా .. లోపలికి పీల్చుతుంటే తియ్యగా, పుల్లగా, చల్లగా... ఆ మజాయే వేరు. ఓ పక్క మోచేతి వరకూ కారిపోతు భలే ఉంటుంది. పుల్ల ఐసుకో తమాషా కథ ఉంది. 1905లో 'ఫ్రాంక్ ఎవర్సన్' పండ్లరసం తీసి డీప్‌ఫ్రిజ్‌లో పెట్టి హాయిగా నిద్రపోయాడు. లేచిచూస్తే అది గడ్డకట్టుకుపోయింది. తింటే భలేబాగుందట. ఇక పుల్లగుచ్చి అమ్మేయవచ్చు అనే ఆలోచనతో దానికి 'పాప్సికల్' అనే పేరుపెటి ్టమరీ అమ్మకం మొదలుపెట్టాడు. అదిగో ... అలా పుల్లైసు అన్ని దేశాలకూ చేరింది.
ఇంగ్లండ్ రాజు 1వ 'ఛార్లెస్ దగ్గర ఒక ఫ్రెంచ్ వంటవాడు ఉండేవాడు. ఛార్లెస్‌కు భోజనం చేశాక పండ్ల ముక్కలు తినడం అలవాటు. వంటవాడొకరోజు తనే చేసిన ఐస్‌క్రీమ్ వడ్డించాడు. ఛార్లెస్‌కి ఆ ఐస్ ఎంతగా నచ్చేసిందంటే తయారీ రహస్యాన్ని ఎవరికీ చెప్పొద్దని వంటవాడితో చెప్పాడు. 1649లో ఛార్లెస్ మరణించాడు. మరి వంటవాడు ఊరుకుంటాడా.. డబ్బుకు ఆశపడి ఆ రహస్యాన్ని బయటకు కక్కేశాడు. 1550లో 'విల్లే ఫ్రాంక్' అనే వైద్యుడు ఉప్పు కలిపితే ఐస్‌క్రీమ్ మెత్తగా, త్వరగా తయారవుతుందని చేసి చూపించాడు.
అయితే ఐస్‌క్రీమ్ చూస్తే తినకుండా ఉండలేం. కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం కాబట్టి కాస్త దూరంగా ఉంచితేనే మంచిది. అదీ చలికాలం మరీనూ... తింటే వెంటనే జలుబు, దగ్గు కలిసికట్టుకుని వచ్చేస్తాయి. అంతేకాక ఎక్కువగా తింటే కొవ్వు పెరిగి ఊబకాయం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి ఒకటి తింటే సరిపోతుంది.
Authorization