పక్షులు ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగురుతాయి. కోడి కూడా ఎగురుతుంది కానీ తక్కువ ఎత్తు మాత్రమే. కోడి ఎముకలు ఇతర పక్షుల ఎముకల్లాగా బోలుగా ఉండవు. కొద్దిగా మూలుగు ఉంటుంది. అందుకే ఎక్కువ ఎత్తు, దూరం ఎగరలేవు. కోడిపిల్ల అయితే గాలిలో 13 సెకన్లకంటే ఎక్కువసేపు ఎగురలేదు. తిమింగలాలు, తాబేళ్ల వంటి జలచరాలను నీటిలోపల బాగా లోతుకు తీసుకువెళ్లి వదిలేస్తే, అవి తేలకుండా మునిగిపోతాయి.