ఇవి అందమైన రంగురంగుల పక్షులు. పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలో ఈ పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి మెరోపిడే కుటుంబానికి చెందినవి. రెడ్ థ్రోటెడ్ బీ ఈటర్ శాస్త్రీయ నామం మెరోప్స్ బుల్లకీ. 1817లో వెయిలాట్ అనే శాస్త్రవేత్త ఈ పక్షికి శాస్త్రీయంగా నామకరణం చేశారు. వీటి మెడభాగం ఎరుపు రంగులో ఉంటుంది. దాన్ని బట్టే ఈ పక్షులను తేలికగా గుర్తిస్తారు. ఈ పక్షులు తేనెటీగలను, ఇతర కీటకాలనూ ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పిల్లల్ని పెంచడానికి ఇతర పక్షుల సహాయాన్ని కూడా తీసుకుంటాయి. సహాయం చేసిన పక్షులు కనుక ఒకవేళ ఆ మరుసటి సంవత్సరం గూడు కట్టుకునేటట్లయితే అవి పెంచిన పిల్లలు వాటికి సహాయం చేస్తాయి.