ఒక కాగితాన్ని నకలు తీసే యంత్రాన్ని 'ఫోటో కాపియర్' అంటారు. రోజూవారీ పనుల కోసం ఈ యంత్రాన్ని రూపొందించిన మొదటి సంస్థ పేరే 'జిరాక్స్'. ఇది జిరాగ్రఫీ అనే గ్రీకు పదం నుంచి పుట్టింది. అంటే పొడిరాత అని అర్థం. ఇప్పుడు నకళ్లను తీయడం కోసం ఎన్నో సంస్థల ఫోటోకాపియర్లు వచ్చాయి. కానీ జిరాక్స్ అన్న పేరు దానికి పర్యాయపదంగా స్థిరపడిపోయింది. ఫోటోస్టాట్ అన్న పదం కూడా అమెరికాకి చెందిన ఫోటోస్టాట్ కార్పొరేషన్ నుంచి వచ్చిందే.....