ప్రపంచంలో వేగంగా పెరిగే చెట్టు ఎంప్రెస్ లేదా ఫాక్స్గ్లోవ్. దీని శాస్త్రీయ నామం పాలో నియాటమెన్టసా. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదిగే చెట్టుగా గిన్నిస్ పుస్తకంలో నమోదయింది. నాటిన మూడు వారాల్లోనే ఒక అడుగు ( 30 సెం.మీ) వరకూ పెరుగుతుంది. ఏడాదికల్లా ఆరు మీటర్ల ఎత్తుకు ఎదిగేస్తుంది. చైనాలో స్థానికంగా ఉండే చెట్టిది. అమెరికాలో వీటి జాతులన్నీ సహజసిద్ధంగా పెరుగుతాయి. వీటిని ఉద్యానవనాల్లో, రహదారుల్లో విరివిగా పెంచుతారు. ఎందుకంటే ఇతర చెట్ల కంటే 3-4 రెట్లు ఎక్కువగా ఆక్సిజన్ అందిస్తుంది. ఆకుల్లో నత్రజని ఎక్కువగా ఉన్నందువల్ల పశువుల మేతకు ఉపయోగిస్తారు. ఈ చెట్టుకు గొట్టాల్లా ఉండే ఊదారంగు పువ్వులు పూస్తాయి.