చలికి మన వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. శరీరంలో వేడి బయటకు వెళ్లిపోకుండా చర్మం తీసుకునే రక్షణ చర్యే ఇది. చలికి వెంట్రుకల కుదుళ్లలో ఉండే చిన్న కండరాలు ముడుచుకుపోతాయి. దాంతో వెంట్రుకలు లేచి నిలబడుతాయి.విపరీతమైన భయం, అంతులేని ఆనందం కలిగినా ఇలాగే జరుగుతుంది. భయపడ్డప్పుడేమో, రక్తంలో 'అడ్రినలిన్' హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. దాంతో, గుండె వేగం పెరిగి, ప్రమాదాన్ని ఎదుర్కొనేలా శరీరం సిద్ధపడుతుంది. ఈ క్రమంలో వెంట్రుకలు కూడా నిక్కబొడుచుకుంటాయి. ఆనందం కలిగినపుడు 'డొపమైన్' హార్మోన్ రక్తంలో విడుదలవుతుంది. దీంతో, శరీర ఉష్ణోగ్రత, గుండె వేగం పెరిగి వెంట్రుకలు నిలుస్తాయి.