ఆఫ్రికా ఖండంలోని ఎడారుల్లో కనిపించే ఈ ఉడతకి దాని తోకే పెద్ద గొడుగు. ఇవి సంఘజీవులు. వందల కొద్దీ ఉడతలు పక్కపక్కనే బొరియల్ని ఏర్పరచుకుని ఉంటాయి. దుంపలు, కాయలు, పురుగులు లాంటి ఆహారంతో కాలం గడిపేస్తాయి. కానీ వీటిని తినేందుకు పాములాంటి శత్రువులు వస్తే మటుకు కలసికట్టుగా ఎదురుదాడి చేస్తాయి. దగ్గర్లో ఏదన్నా ఆపద ఉందనుకుంటే, ఈలవంటి శబ్దం చేయడం ద్వారా తోటి ఉడతల్ని హెచ్చరిస్తాయి. ఎండలో తిరుగుతున్నప్పుడు వేడి నుంచి తప్పించుకునేందుకు, కుచ్చులాంటి తోకల్ని నెత్తిమీద వేసుకుంటాయి. లేదా ఒళ్లంతా కుమ్మరించుకుంటాయి.