హారు ఫ్రెండ్స్..! ముత్యాల గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రతి ఇంట్లో ఉంటాయివి.. అంతేకాదు పిల్లల్ని మెచ్చుకోవడానికి కూడా పెద్దలు అప్పుడప్పుడూ ముత్యాల్లాంటి పిల్లలని అంటుంటారు. మరి అంత గొప్పవైన ముత్యాలు ఎలా ఏర్పడుతాయో తెలుసుకుందామా...
- ప్రకతిలో లభించే నవరత్నాలలో ఒకటి ముత్యం. రత్నమంటే గొప్పదని అర్థం. ముత్యం లాటిన్ పదమైన జూఱతీబఎ నుంచి వచ్చింది. దాన్నే ఆంగ్లంలో జూవaతీ అంటారు. పియర్ అంటే రత్నం లాంటి ఆకారాన్ని ప్రతిఫలించేది అని అర్థమన్నమాట.
- ముత్యాలు మొలస్కా జాతికి చెందిన ముత్యపు చిప్పలలో తయారవుతాయి. ఇవి రెండు రకాలు... సహజమైనవి, కృత్రిమమైనవి. సహజమైన ముత్యాలు మంచినీళ్లలో అంటే నదుల్లో, సరస్సుల్లోను, ఉప్పునీళ్లలో అంటే సముద్రాలు-మహాసముద్రాలలోనూ తయారవుతాయి. ఇవి ఎలా రూపొందుతున్నాయో తెలుసుకున్న పరిశోధకులు కృత్రిమంగా కూడా తయారు చేయడం మొదలుపెట్టారు.
- ముత్యాలు ఆల్చిప్పల్లో తయారవుతాయని తెలుసుకదా! ఇవి ఆల్చిప్పల్లోనే కాకుండా క్లామ్ అనే ఇంకో జలచరంలో కూడా లభిస్తారు. అయితే ముత్యం క్లామ్లో చాలా అరుదుగా తయారవుతుంది. అందుకే అందరికీ ఆల్చిప్పల్లో తయారవుతాయని మాత్రమే తెలుసు.
- ఇక తయారీ విషయానికొస్తే ఆల్చిప్ప మొలస్కా జాతికి చెందిన జీవి. ఇది కాల్షియం కార్బనేట్తో సమ్మిళితమై ఉంటుంది. ఇందులోని రెండు భాగాలు రబ్బరు బాండ్ లాంటి ఎలాస్టిక్ బంధంతో బలంగా అతుక్కుని ఉంటాయి. ఈ రెండు చిప్పలు కలిసే దగ్గర చిన్న ఎడం ఉంటుంది. అది ఆల్చిప్ప నోరన్నమాట. అందులోంచి ఆహారాన్ని లోపలికి తీసుకుంటుంది. అయితే ఏదైనా పదార్థం దాని నోట్లోకి వెళ్లాలని ప్రయత్నించిందనుకోండి. తనను తాను రక్షించుకోవడం కోసం వెంటనే అది నేకర్ అనే ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఆ పదార్థం ఆల్చిప్పకున్న కాల్షియం కార్బనేట్తో కలవడం వల్ల గట్టిగా అయిపోతుంది. అదే ముత్యంలా మారుతుంది. అయితే సహజ సిద్ధమైన ముత్యాలు ఏ రెండూ ఒకేలా ఉండవు.
- ముత్యాలన్నీ సముద్రం అడుగుభాగంలో దొరుకుతాయి. ఇవి వెలికి తీయడం చాలా కష్టం. పైగా ఖర్చు కూడా. ఒకవేళ తీసినా చాలా తక్కువ ముత్యాలే దొరుకుతాయి. ఎందుకంటే వేలకొద్దీ ఆల్చిప్పల్ని పట్టుకుంటే పదుల సంఖ్యలో మాత్రమే ముత్యాలు లభిస్తాయి. అన్ని ఆల్చిప్పల్లోనూ ముత్యాలుండవు.
- అందుకే పరిశోధకులు కృత్రిమ ఆల్చిప్పలను తయారుచేస్తున్నారు. ఎలా అంటారా! వీటిని తయారుచేయడానికి ఫ్రెష్ వాటర్ పెర్ల్్ ఫామ్స్, అకోయా, టహీషియన్, సౌత్ ఏషియా పెర్ల్స్ వంటి నాలుగు రకాల పద్ధతులను అనుసరిస్తారు. ముందుగా ఆల్చిప్పలను సేకరించి వాటిలో ఇతర ఆల్చిప్పల్లోని కణజాలాన్ని ప్రవేశపెట్టి పై పద్ధతులను అనుసరించి ముత్యాలను తయారుచేస్తారు. వీటిని తెలుపుతోపాటు, గులాబీ, నలుపు,ఎపురు నీలం, ఆకుపచ్చ వంటి వివిధ రకాల రంగుల్లో కూడా తయారుచేస్తున్నారు. మనదేశంలో కాక చైనా, జపాన్, మయన్మార్ వంటి దేశాల్లోనూ ముత్యాల వ్యాపారం ఎక్కువగా సాగుతుంది.
- 4వేల ఏండ్ల క్రితం.. చైనా వారు ధరించే ఆభరణాలలో ముత్యాలను వాడేవారు. అంతేకాదు వాళ్లు ముత్యాన్ని స్వచ్ఛతకు, విలువకు గుర్తుగా భావించేవారు. విచిత్రమేమిటంటే ఇక్కడి ధనవంతుల ఇండ్లలో ఎవరైనా చనిపోతే వారి నోట్లో ఒక ముత్యాన్ని పెట్టి అంత్యక్రియలు నిర్వహించేవారు. ముత్యానికి ఎంత విలువ ఉందంటే అప్పట్లో చైనా ప్రభుత్వం పన్నులను ముత్యాల రూపంలో కూడా చెల్లించేందుకు అనుమతిచ్చింది.
- ప్రపంచంలోనే అతిపెద్ద ముత్యమేంటో తెలుసా! ఫిలిప్పీన్స్లోని పల్వన్ సముద్రంలో దొరికిన 'ద పెర్ల్ ఆఫ్ లా జు'.
Authorization