అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమ్మీదకు వచ్చిన వ్యోమగాములు రెండు అంగుళాల పొడవు పెరిగి ఉంటారు. అంతరిక్షంలో భూమ్యాకర్షణ ఉండదు. ఆ స్థితిలో ఎముకల మధ్య ఉండే కార్టిలేజ్, వెన్నెముక డిస్క్‌ల మధ్య ఉండే మెత్తటి పొరలు ఉబ్బి సైజు పెరుగుతాయి. దాంతో మనిషి పొడవు పెరుగుతాడు. భూమ్మీదకు వచ్చిన కొద్ది రోజుల్లోనే తిరిగి మామూలవుతారు.