సౌర విద్యుత్‌కు ఇటీవల ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సౌర విద్యుత్ అంటే సూర్యుడి నుండి వెలువడే ఉష్ణాన్ని సౌర పలకల ద్వారా విద్యుత్‌గా మారుస్తారు. దీనినే సౌర విద్యుత్ అంటాం. సూర్యుని నుంచి భూమికి సుమారు 174 పెటావాట్ల శక్తి గల సూర్యకిరణాలు వెలువడతాయి. దీనిలో సుమారు 30 శాతం అంతరిక్షంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. మిగతా వేడిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. సౌరవిద్యుత్తును హీట్ ఇంజన్ల నుంచి, ఫొటో వోల్టాయిక్ ఘటాల నుంచి ఉత్పత్తి చేస్తారు. సోలార్ పానెల్‌లోని ఫొటోవోల్టాయిక్ సెల్స్ వెలుతురుని ఎలక్ట్రాన్లుగా రూపాంతరం చేస్తాయి. ఆ ఎలక్ట్రాన్లను విద్యుచ్ఛక్తిగా మారుస్తారు. ఒక్కొక్క సోలార్ సెల్ 1.5 పవర్ జెనరేట్ చేస్తాయి. 30,40 సెల్స్ ఇవి సిరీస్ పేర్లల్‌గా కలిపితే ఒక మాడ్యూల్ అవుతుంది. తగిన శక్తిని కలిగిన కాంతి ఏదైనా పొటాషియమ్ లాంటి కాంతి ప్రభావిత పదార్థాలపై ఉద్గారం చెందినపుడు ఆ పదార్థంలో ఉన్న ఎలక్ట్రానులు బయటకు వెలువడే ప్రక్రియను స్ఫురదీప్తి (ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్) గా పిలుస్తారు. ఈ ప్రక్రియని జరపడానికి కాంతికి అవసరమయ్యే అతి తక్కువ పౌన:పున్య శక్తిని ప్రారంభశక్తిగా పిలుస్తారు.
Authorization