స్కేటింగ్లో పిల్లలు ప్రతిభ కనబరిస్తే అది వారి ప్రతిభ అవుతుంది. మరి ఒక డాగ్ రికార్డు సాధిస్తే.. అది రికార్డు అవుతుంది.
పెంపుడు జంతువులకు యజమానులు సరదాగా ఏవో ఆటలు నేర్పిస్తుంటారు. అలా లూసియానా తన పెంపుడు కుక్కకు స్కేటింగ్ బోర్డుపై బ్యాలెన్స్ చేయడం నేర్పింది. బుజ్జి కుక్క ఒట్టో అక్కడితో ఆగలేదు. గిన్నిస్ రికార్డుల వరకూ దూసుకుపోయింది.
పెరూలోని ఖలిమా' నగరంలో ఒట్టో ప్రపంచ రికార్డు స ష్టించింది. 30 మంది వరుసగా కాళ్లు దూరం పెట్టి నిల్చున్నారు. ఒట్టో స్కేట్ బోర్డుపై బ్యాలెన్స్ చేస్తూ 30 మంది కింద నుంచి దూసుకుపోయింది. పైగా చాలా వేగంగా. ఏ ఒక్కరికీ తగలకుండా బ్యాలెన్స్ తప్పకుండా అందరినీ దాటేసింది. ఈ విన్యాసంతో గిన్నిస్ వాళ్లు రికార్డు ఇచ్చేశారు. దీంతో ఈ శునకం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కేసింది. ఒట్టోకు మూడేళ్లు. గత రెండేళ్ల క్రితమే స్కేటింగ్ బోర్డు ఎక్కింది. అప్పటి నుంచీ రోజూ ఎంతో సాధన చేస్తోంది. మూడు కాళ్లు బోర్డుపై పెట్టి ఒక కాలితో నేలను తోసి బోర్డుపై ముందుకు దూసుకెళుతుంది.
అసలు ఈ కుక్కకు స్కేటింగ్ ఎలా వచ్చిందంటే... లూసియానా టీవీలో టిల్మన్ అనే కుక్క గురించి చూసిందిట. అది స్కేటింగ్ బోర్డుపై బ్యాలెన్స్ చేస్తుంటే ఒట్టోకూ ఆ విద్య నేర్పించారు. ఈ కుక్కకు స్కేటింగే కాదు, ఇంకా ఎన్నో విద్యలు వచ్చు అలలపై స్కిమ్బోర్డుపై విన్యాసాలు కూడా చేయగలదట.
Authorization