కంప్యూటర్ను పనిచేయించేందుకు మనం కొన్ని ఆజ్ఞలు (కమాండ్స్)వినియోగిస్తాం. ఈ కమాండ్స్అన్నింటినీ కలిపి సాఫ్ట్వేర్ అంటారు. కంప్యూటర్ ఏ విధంగా ఏ పనులు చేయాలనేది సాఫ్ట్వేర్ నిర్ణయిస్తుంది. కంప్యూటర్ పనితీరు గురుంచి క్షుణ్ణంగా అవగాహన ఉన్నవారు. కొంత మంది సరదాకోసమో, దురాలోచనతోనో కొన్ని రకాల సాఫ్ట్వేర్లను తయారుచేస్తారు. ఈ సాఫ్ట్వేర్లు కంప్యూటర్లను తప్పుదారి పట్టించడం, పనిచేయకుండా నిలిచిపోయేలా చేయడం లేదా నిల్వఉన్న సమాచారం చెరిగిపోయేలా చేసి ఎంతో నష్టం కలిగిస్తాయి.ఇలాంటి సాప్ట్వేర్లనే 'వైరస్' అంటారు. అందుకే కంపెనీలు తయారుచేసిన వైరస్లేని సాఫ్ట్వేర్ను వాడడం శ్రేయస్కరం. ఇంటర్నెట్ నుంచి సమాచారం తీసుకునేటప్పుడు ఇ-మెయిల్స్ చేసేటప్పుడు, కొత్తసాఫ్ట్వేర్ను లోడ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మానవ వైరస్లకు 'టీకాలు' ఎలాగో, కంప్యూటర్ వైరస్లను 'యాంటీవైరస్' సాఫ్ట్వేర్ల ద్వారా తొలగించుకోవచ్చు.