ఎడారి ప్రదేశాలకు వెళ్లినపుడు అక్కడ పూర్తిగా ఇసుకతో కప్పిఉంటాయి. ఇటువంటి నేలల్లో వాహనాలు నడవవు. ఒంటెలే అక్కడ వాహనంగా పనిచేస్తాయి. అందుకే ఒంటెను 'ఎడారి ఓడ' అంటారు. ఎంత వేడిలోనూ తన శరీర ఉష్ణోగ్రతను కోల్పోకుండా ఉండగలదు. మరోప్రత్యేకత ఏమిటి అంటే ఆరు నుంచి పదిరోజుల వరకు నీరు తాగకుండా జీవించగలదు. శరీరంలో మూడో వంతు వరకు నీటిని కోల్పోయినా తట్టుకోగలదు. అందుకోసం ఒంటె శరీరం నిర్మితమై ఉంది. ముక్కు, చెవులు అందుకు తగినట్లుగా రూపొంది ఉన్నాయి. ఒంటె వెనుకభాగంలో మూపురం లాంటి నిర్మాణం ఉంటుంది. దీనిలో పెద్ద మొత్తంలో ఆహారాన్ని, నీటిని నిల్వచేసుకుని అవసరం మేర వాడుకుంటాయి. ఈ మూపురంలో రెండు సంచుల వంటివి ఉంటాయి. రోజుల తరబడి ఎడారిలో ప్రయాణించాల్సి వచ్చినపుడు కొద్దికొద్దిగా ఈ నిల్వ ఉన్న ఆహారాన్ని వాడుకుంటాయి. అలాగని నీరు కావాలనుకున్నప్పుడు ఒంటె మూపురాన్ని కోస్తే అందులో మనకేమీ దొరకదు.