కోతి అచ్చం మనిషిలాగే ఉంటుంది. నిజానికి మనిషి కోతి నుంచే వచ్చాడు. మనిషి తర్వాత అత్యంత తెలివైన జంతువు కోతి ఒక్కటే. మనిషి మాట్లాడుతాడు. కోతి మాట్లాడదు అంతే తేడా. భాష లేకపోయినా రకరకాల శబ్ధాలతో ఒక విషయాన్ని ఒక కోతి మరొక కోతికి చాలా సులువుగా చేరవేస్తుంది. ప్రపంచంలో 264 కోతి జాతులున్నాయి. రంగు, ఆకారం, పరిమాణాలలో ప్రతి జాతి కోతికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. పిల్లల్ని కాపాడటంలో కోతి అత్యంత శ్రద్ధగా ఉంటుంది. ప్రేమ, కోపం, దు:ఖం, ప్రేమరాహి త్యం, నవ్వు, కోపంగా అరవడం వంటి భావావేశాలన్నీ కోతిలో ఉంటాయి. కొన్ని కోతులు సమూహంగా ఉంటాయి. ఒక ఉమ్మడి కుటుంబంలాగా అన్నమాట. చేతులు, వేళ్లు మనిషికి ఉన్నట్లే ఉండటంతో కోతులు గుంతలు తవ్వడానికి కర్రలు, రాళ్లను మనిషిలాగే ఉపయోగిస్తాయి. అన్నట్లు మరో విషయం.. మనుషులకు మాత్రమే వేలిముద్రలు ఒకదానితో మరొకటి సరిపోలవు అనుకుంటాం. కానీ కోతుల వేలిముద్రలు కూడా వేటికవి వేరుగా ఉంటాయి.